క్రేజీ హీరోల గ్యాంగ్ స్టర్ డ్రామా ఆగిపోవడానికి కారణం?
చాలా ఓటీటీ సిరీస్ లు గ్యాంగ్ స్టర్ కథలతో వచ్చి ఆదరణ దక్కించుకున్నాయి.
By: Tupaki Desk | 9 Sep 2024 7:30 PM GMTప్రస్తుతం గ్యాంగ్ స్టర్ డ్రామాల హవా సాగుతోంది. వెండితెర, ఓటీటీ రెండు చోట్లా మాఫియా, గూండారాజ్ కథలకు గిరాకీ అంతకంతకు పెరుగుతోందే కానీ తరగడం లేదు. గ్రిప్పింగ్ డ్రామా, ఎమోషన్స్, భారీ యాక్షన్ కి ఆస్కారం ఉంటుంది గనుక ఇలాంటి కథల్ని ప్రేక్షకులు కూడా ఆస్వాధిస్తున్నారు. కేజీఎఫ్, విక్రమ్, యానిమల్ ఇవన్నీ ఇవే కేటగిరీ సినిమాలు. చాలా ఓటీటీ సిరీస్ లు గ్యాంగ్ స్టర్ కథలతో వచ్చి ఆదరణ దక్కించుకున్నాయి.
అదే క్రమంలో ట్యాలెంటెడ్ స్టార్లు దుల్కర్ సల్మాన్ - ఫహద్ ఫాసిల్ ప్రధానపాత్రల్లో `గ్యాంగ్స్ ఆఫ్ బండదుక్క` పేరుతో భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామాని వెండితెరకెక్కించాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసింది. కోవిడ్ సమయంలో దీనిపై పలు కథనాలు వెలువడ్డాయి. అనీష్ అన్వర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. దీని కోసం ఇద్దరు ప్రధాన స్టార్లతో పాటు మేకర్స్ మరో ఐదుగురు హీరోలను కూడా ఎంపిక చేయాలని భావించారు. ఈ సినిమాని పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా తెరకెక్కించాలన్నది ప్లాన్.
అనీష్ అన్వర్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం నిజ జీవిత పాత్రల ఆధారంగా కథను రూపొందించారు. కొన్ని తరాలలో కథాంశం విస్తరించి ఉంటుంది. సినిమాలోని సంఘటనలు 1979-2019 మధ్య కాలంలో జరిగినవి. స్క్రీన్ రైటర్ నిజాం రావుతార్‌తో కలిసి బండదుక్కలోని ఒక గ్రామాన్ని సందర్శించిన దర్శకుడు అన్వర్ స్క్రిప్టును తయారు చేసారు. గ్రిప్పింగ్ స్టోరి, స్క్రీన్ ప్లే దానికి తోడు భారీ యాక్షన్ కి ఆస్కారం ఉన్న కథాంశాన్ని రూపొందించారు. అంగమాలి డైరీస్ విజయం తర్వాత ఆ సినిమా నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సినిమా ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు-నిర్మాత విజయ్ బాబు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. నిర్మాత ఈ చిత్రం స్క్రిప్ట్ ను ఎంతగానో ఇష్టపడ్డారు. తాను చదివిన అత్యుత్తమ యాక్షన్ స్క్రీన్‌ప్లేలలో ఒకటిగా దీనిని పేర్కొన్నాడు. అయితే COVID-19 మహమ్మారి ప్రాజెక్ట్ భారీ జాప్యానికి కారణమైంది. ఫలితంగా ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ని నిలిపేసారని తెలిసింది. ప్లాన్స్ డ్రాప్ అయినా కానీ `బెంగుళూరు డేస్` తర్వాత దుల్కార్ -ఫహద్ ఇద్దరూ మరోసారి కలిసి నటించి ఉంటే అది డ్రీమ్ కాస్ట్ అయ్యేది. 2024-25 సీజన్ మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటిగా ఉండేది. కానీ అది జరగలేదు. దీనికి కచ్ఛితంగా కరోనా ఒక కారణం.
ఆ ఇద్దరి కెరీర్ లైనప్‌ల విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్.. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో `లక్కీ బాస్కర్` చిత్రంలో నటిస్తున్నారు. 1980ల నాటి కథతో గ్రిప్పింగ్ థ్రిల్లర్ డ్రామా ఇది అని తెలుస్తోంది. ఈ చిత్రం కథాంశం ఆసక్తికరమైనది. ఒక బ్యాంకర్ అతడి రహస్య సంపదల గురించిన కథాంశమిది. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రంలో సాయి కుమార్, హైపర్ ఆది, అయేషా ఖాన్, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు ఫహద్ ఫాసిల్ ఇప్పటికే రజనీకాంత్ `వేట్టైయాన్`, అల్లు అర్జున్ `పుష్ప 2: ది రూల్` చిత్రాల్లో నటించారు. ఇవి రిలీజ్ కి రానున్నాయి