పెళ్లికి రెడీ అవుతున్న క్రేజీ హీరోయిన్
అయితే ఈ వార్తల్లో నిజం లేదని, ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తున్నారని, ఇంత కంటే నీచం మరొకటి లేదని సాయి పల్లవి స్వయంగా తన పెళ్లి వార్తలపై ఫైర్ అయింది.
By: Tupaki Desk | 11 Oct 2023 10:56 AM GMTక్రేజీ హీరోయిన్‌లు, హీరోయిన్‌లపై ఈ మధ్య పెళ్లి రూమర్‌లు జోరుగా షికారు చేస్తున్నాయి. ఎంతగా పెళ్లి వార్తలపై క్లారిటీ ఇస్తున్నా ఆ వార్తల ప్రవాహం మాత్రం ఆగడం లేదు. ఈ మధ్య ఇద్దరు హీరోయిన్‌లు కీర్తి సురేష్, సాయి పల్లవిలపై పెళ్లి వార్తలు జోరుగా షికారు చేశాయి. అయితే అందులో కీర్తి సురేష్‌పై వచ్చిననన్ని వార్తలు ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్‌పై రాలేదు. ఒకసారి తన ఫ్రెండ్‌తో ప్రేమలో ఉందంటే మరో సారి యువ సంగీత సంచలనం అనిరుధ్‌తో ప్రేమలో ఉందని మరో సారి.
అవన్నీ రూమర్సేనని తేలినా కూడా మళ్లీ మళ్లీ కీర్తి సురేష్ పెళ్లిపై పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కీర్తి పెళ్లి పుకార్లపై ఆమె తండ్రి స్వయంగా వివరణ ఇస్తూ ఓ వీడియోని కూడా విడుదల చేయడం తెలిసిందే. ఆ తరువాత మరో హీరోయిన్ సాయి పల్లవి తమిళ దర్శకుడిని పెళ్లాడిందంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు షికారు చేశాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తున్నారని, ఇంత కంటే నీచం మరొకటి లేదని సాయి పల్లవి స్వయంగా తన పెళ్లి వార్తలపై ఫైర్ అయింది.
దీంతో పెళ్లి పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇప్పడు ఈ జాబితాలో మరో క్రేజీ హీరోయిన్ చేరింది. తనే శ్రీలీల. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్న శ్రీలీల త్వరలో పెళ్లి చేసుకోబోతోందని తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తల నేపథ్యంలో వెంటనే రంగంలోకి దిగిన శ్రీలీల టీమ్ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. కెరీర్ పరంగా క్షణం తీరకలేకుండా ఆమె గడిపేస్తున్నారని, కెరీర్‌తో పాటు స్టడీ విషయంలోనూ శ్రీలీల చాలా స్ఫష్టంగా ఉన్నారని పేర్కొన్నారట.
ప్రస్తుతం వివిధ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ శ్రీలీల బిజీగా ఉందని, ఇలాంటి సమయంలో ఆమెకు ప్రేమించడానికి, పెళ్లికి సమయం లేదని, కాబట్టి ఇలాంటి రూమర్స్‌ని నమ్మొద్దని తెలిపినట్టుగా తెలిసింది. ప్రస్తుతం శ్రీలీల నటించిన `భగవంత్ కేసరి` ఈ అక్టోబర్ 19న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. పంజా వైష్ణవ్ తేజ్‌తో `ఆదికేశవ`, నితిన్‌తో `ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్`, సూపర్ స్టార్ మహేష్ తో `గుంటూరు కారం`, పవర్‌స్టార్‌తో `ఉస్తాద్ భగత్ సింగ్`, నవీన్ పొలిశెట్టితో `అనగనగ ఒక రాజు` వంటి సినిమాల్లో నటిస్తోంది.