Begin typing your search above and press return to search.

టాలీవుడ్ నెక్స్ట్.. కంటెంట్ ఉన్న టైటిల్స్!

టాలీవుడ్ నెక్స్ట్ ఆరు నెలలు చాలా సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి.

By:  Tupaki Desk   |   15 July 2024 11:14 AM GMT
టాలీవుడ్ నెక్స్ట్.. కంటెంట్ ఉన్న టైటిల్స్!
X

టాలీవుడ్ నెక్స్ట్ ఆరు నెలలు చాలా సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అరడజను పాన్ ఇండియా మూవీస్ ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అవుతున్నాయి. అలాగే స్టార్స్ నుంచి టైర్ 2 హీరోల వరకు కొత్త కొత్త కథలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకప్పుడు రెగ్యులర్ కమర్షియల్ జోనర్ సినిమాలు మాత్రమే టాలీవుడ్ లో కనిపించేవి. అయితే ఇప్పుడు డిఫరెంట్ కథలని హీరోలు ట్రై చేస్తున్నారు. అన్ని భాషల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే స్టోరీస్ ని ఎంపిక చేసుకుంటున్నారు. మాస్ టచ్ మాత్రం మిస్ కాకుండా చూసుకుంటున్నారు.

నెక్స్ట్ టాలీవుడ్ లో తెరకెక్కనున్న సినిమాల టైటిల్స్ చూసుంటే ఎంత బలమైన కథలతో మన హీరోలు మూవీస్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అఖిల్ అక్కినేని పాన్ ఇండియా స్థాయిలో చేస్తోన్న మూవీకి ధీర అనే టైటిల్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ సినిమాకి కిష్కిందపురి అనే టైటిల్ ని అనుకుంటున్నారంట. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ 12వ సినిమా టైటిల్ హైందవ అని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం

బాబీ, బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న NBK109 సినిమాకి వీరమాస్ అనే టైటిల్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యిందంట. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త సినిమాకి మెరుపు టైటిల్ ని పరిశీలిస్తున్నారు. విజయశాంతి ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకి డ్రాగన్ టైటిల్ ని పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కనున్న పాన్ వరల్డ్ మూవీకి ఫౌజీ అనే పేరుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న RC16కి పెద్ది అనే టైటిల్ ని పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీకి సంబరాల ఏటిగట్టు మూవీని ఫైనల్ చేసారంట. శర్వానంద్ 36 చిత్రానికి రేస్ రాజా అనే టైటిల్ ని పెట్టాలని ఆలోచిస్తున్నారంట. విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కనున్న క్రైమ్ కామెడీ మూవీ సంక్రాంతికి వస్తున్నాము అనే టైటిల్ ని పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Akhil6 - ధీర

BSS11 - కిష్కిందపురి

BSS12 - హైందవ

NBK109 - వీరమాస్

NKR21 - మెరుపు

NTR31 - డ్రాగన్

PrabhasHanu - ఫౌజీ

RC16 - పెద్ది

SDT18 - సంబరాల ఏటిగట్టు

Sharwa36 - రేస్ రాజా

VenkyAnil3 - సంక్రాంతికి వస్తున్నాము