Begin typing your search above and press return to search.

క‌ళాత్మ‌కత‌పై క‌మ‌ర్షియ‌ల్ సినిమా డామినేష‌న్

ఎడారి ఇసుక‌లో ట్రాప్ లో ప‌డిన గొర్రెల కాప‌రి క‌థ‌తో రూపొందించిన క‌ల్ట్ జాన‌ర్ ఫిలిం ఆడు జీవితం ఐదు రోజుల్లో

By:  Tupaki Desk   |   2 April 2024 5:49 AM GMT
క‌ళాత్మ‌కత‌పై క‌మ‌ర్షియ‌ల్ సినిమా డామినేష‌న్
X

ప్ర‌తి వారం సినిమాలొస్తున్నాయి.. వెళుతున్నాయి.. కానీ గ‌త వీకెండ్ లో వ‌చ్చిన రెండు సినిమాలు భారీ బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి. ఇందులో ఒక‌టి ఆర్ట్ ఫిలిం కాగా, మ‌రొక‌టి ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమా. ఎడారి ఇసుక‌లో ట్రాప్ లో ప‌డిన గొర్రెల కాప‌రి క‌థ‌తో రూపొందించిన క‌ల్ట్ జాన‌ర్ ఫిలిం ఆడు జీవితం ఐదు రోజుల్లో

50 కోట్లు వ‌సూలు చేయ‌గా, ముగ్గురు అంద‌గ‌త్తెల హంగామాతో రూపొందించిన ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమా `క్రూ` అదే ఐదు రోజుల్లో ఏకంగా 70 కోట్లు వ‌సూలు చేసింది.

క‌ళాత్మ‌క (ఆడు జీవితం) చిత్రాన్ని మించి క్రూ జిగిబిగి మెరుపులు థియేట‌ర్ల‌లో వ‌సూళ్లు రాబ‌డుతున్నాయి. రెండిటికీ మంచి రివ్యూలు వ‌చ్చాయి. ఆడు జీవితంలో పృథ్వీరాజ్ సుకుమార‌న్ పూర్తిగా డీగ్లామ‌ర‌స్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడ‌ని టాక్ రాగా, అటు క్రూ మెంబ‌ర్స్ అయిన సీనియ‌ర్ న‌టీమ‌ణులు ట‌బు, క‌రీనా, యంగ్ బ్యూటీ కృతి స‌నోన్ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డి న‌టించ‌డంతో క‌లెక్ష‌న్స్ అద్భుతంగా కురిసాయి.

అయితే క‌ళాత్మ‌కంగా తీసిన సినిమా కంటే రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్ లో అద్భుత న‌ట‌ప్ర‌తిభను ఉప‌యోగించుకుని యూత్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌లిగితే భారీ మొత్తాన్ని వ‌సూలు చేయొచ్చ‌ని 'క్రూ' నిరూపించింది. ఈ ఫ‌లితం ఆలోచించ‌ద‌గిన‌ది. ప్ర‌జ‌ల మైండ్ సెట్ కి త‌గ్గ‌ట్టు ఎలాంటి సినిమాలు తీయాలో అర్థం చేసుకోవ‌డం చాలా క‌ష్టం అనేది ఇందుకే. బ్లెస్సీ-పృథ్వీరాజ్ టీమ్ ఎనిమిదేళ్ల పాటు శ్ర‌మించి వేచి చూసి తీసిన సినిమాని మించిన వ‌సూళ్లు కేవ‌లం ఆరు నెల‌ల్లో చుట్టేసిన క్రూ సినిమా డామినేట్ చేయ‌డం ఇక్క‌డ ప‌రిశీలించ‌ద‌గిన‌ది.

క‌లెక్ష‌న్స్ డీటెయిల్స్ ఇవీ:

పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో దర్శకుడు బ్లెస్సీ రూపొందించిన‌ మనుగడ డ్రామా ఆడుజీవితం (గోట్ లైఫ్) ప్రారంభ వారాంతం థియేటర్లలో అద్భుతమైన వ‌సూళ్ల‌ను తెచ్చింది. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా రూ.50 కోట్లు వసూలు చేసిన మలయాళ చిత్రంగా ఆడుజీవితం నిలిచింది.

7.6 కోట్ల రూపాయల దేశీయ నికర కలెక్షన్‌తో గురువారం థియేట్రికల్ రన్‌ను ప్రారంభించిన ఈ చిత్రం శుక్రవారం కలెక్షన్‌లో క్షీణించి, 6.25 కోట్ల రూపాయలను వసూలు చేసింది. కానీ ఆడుజీవితం ఇండియా నెట్ కలెక్షన్ శనివారం నాడు 24 శాతం పెరిగింది. ఈ చిత్రం రూ. 7.75 కోట్లు వసూలు చేసింది. ఆదివారం అత్యధిక సింగిల్-డే దేశీయ నికర వ‌సూళ్లు రూ. 9.17 కోట్లు గా నమోదైంద‌ని ఇండస్ట్రీ ట్రాకర్ సాక్‌నిల్క్ నివేదించింది. ప్రస్తుతం, సర్వైవల్ డ్రామా మొత్తంగా రూ. 30.77 కోట్ల నిక‌ర వ‌సూళ్ల‌ను సాధించింది. 50కోట్ల గ్రాస్ తో అద‌ర‌గొట్టింది. విదేశాల నుంచి ఫ‌ర్వాలేద‌నిపించే వ‌సూళ్లు సాధించింది.

మ‌రోవైపు ముగ్గురు క‌థానాయిక‌ల గ్లామ‌ర్ ట్రీట్ నేప‌థ్యంలో రూపొందించిన `క్రూ` దేశ‌వ్యాప్తంగా అద్భుత వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. విడుదలైన నాలుగో రోజు బాక్సాఫీస్ వద్ద క్రూ నిరాశపరచలేదు. టబు, కరీనా కపూర్, కృతి సనన్ నటించిన కామెడీ-హీస్ట్ చిత్రం రూ.10.28 కోట్ల నికర ఓపెనింగుల‌తో ట్రేడ్‌ను ఆశ్చర్యపరిచింది.. గుడ్ ఫ్రైడే సెలవుదినం కారణంగా ఇది కూడా పెరిగింది. తర్వాతి రెండు రోజుల్లో క్రూ మరింత మెరుగ్గా వ‌సూలు చేసింది. శని, ఆదివారాల్లో వరుసగా రూ. 10.87 కోట్లు, 11.45 కోట్ల ఇండియా నెట్‌ని సాధించింది. నాలుగో రోజున రూ. 4.50 కోట్లు ఆర్జించింది. సోమవారం గణాంకాలతో క్రూ దేశీయ మొత్తం రూ. 36 కోట్లకు పైగా నిక‌ర వ‌సూళ్ల‌ను సాధించింది.

అంతర్జాతీయంగా కూడా ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది. వారాంతం వరకు, క్రూ $2.8 మిలియన్ (రూ. 23 కోట్లు) వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రారంభ వారాంతపు వసూళ్లు రూ. 62 కోట్లకు చేరుకుంది. సోమవారం కలెక్షన్లతో ఈ సంఖ్య 70 కోట్లు దాటే అవకాశం ఉంది.