'ఫ్యామిలీ స్టార్' నెగిటివ్ ప్రచారంపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు!
ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్లని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ చర్యలకు దిగుతుంది.
By: Tupaki Desk | 7 April 2024 12:46 PM GMTఇటీవలే విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన 'ఫ్యామిలీ స్టార్' రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం కూడా తెరపైకి వచ్చిన సంగతి విధితమే. తొలి షో అనంతరం కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ లో సినిమా బాగోలేదంటూ ప్రచారం సాగింది. అయితే వీటిని చిత్ర వర్గాలు ఖండిచాయి. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్లని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ చర్యలకు దిగుతుంది. ఈ సినిమా విజయం సాధించకూడదని.. విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని కొందరు వ్యక్తులు, కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనిగట్టుకుని వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.
ఈసినిమా రిలీజ్ కు ముందే నెగిటివ్ పోస్టులు తెరపైకి తెచ్చారన్నారు. నిర్మాణ సంస్ధ ఇచ్చిన కొన్ని సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, అక్కౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావాలనే కొందరు ఫ్యామిలీ స్టార్ చిత్రంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
ప్రేక్షకులు సినిమా చూడకుండా మిస్ లీడ్ చేస్తున్నారని..ఇదంతా విజయ్ మీద వ్యక్తిగత కక్షతో చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.ఈ రకమైన ప్రచారంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాధమిక ఆధారాలతో కేసు దర్యాప్తు చేసి నిందుతుల్ని పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చినట్లు చిత్ర బృందం తెలిపింది. మరి ఈ ప్రచారం వెనుక నిగ్గు తేల్చాల్సింది సైబర్ క్రైమ్ పోలీసులని తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని పరశురాం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. గతంలో ఇదే కాంబినేషన్ లో తెరకెక్కిన `గీతగోవిందం` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమా అనంతరం పరశురాం సూపర్ స్టార్ మహేష్ హీరోగా `సర్కారు వారి పాట` చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది యావరేజ్ గా ఆడింది.