# ధనుష్ 51..ఇది లీడర్ -2 నా?
ఖరీదైన భారీ ఆకాశహర్మ్యాలు మరోవైపు పేదరికాన్ని ప్రతిబింబించేలా మురికివాడ
By: Tupaki Desk | 28 July 2023 7:04 AM GMT# ధనుష్ 51వ చిత్రం శేఖర్ కమ్ములా దర్శకత్వంలో ఎట్టకేలకు పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. నిన్న రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ తో అన్నిరకాల సందేహాలకు సమాధానాలు దొరికేసాయి. సినిమా కాన్సెప్ట్ ఏంటి? అన్నది కూడా క్లారిటీ వచ్చేసింది. ఒకవేళ నాగార్జున నటించిన అది ఓ కీలక పాత్ర అయ్యే అవకాశం ఉంది. ఇది మల్టీస్టారర్ కాదని తేలిపోయింది. కాన్సెప్ట్ పోస్టర్ తో స్టోరీ అర్దమవుతుంది.
ఖరీదైన భారీ ఆకాశహర్మ్యాలు ..మరోవైపు పేదరికాన్ని ప్రతిబింబించేలా మురికివాడ..ఈ రెండింటికి మధ్యలో పాత వంద రూపాయల నోట్ల కట్టని బట్టి సమాజంలో అసమానతల్ని హైలైట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కమ్ములా లీడర్ -2 తీస్తున్నాడా? అన్న సందేహాలు మొదలయ్యాయి. దనుష్ పాత్రని ఆధారంగా చేసుకుని సమాజాన్ని ప్రశ్నించేలా మరో లీడర్ దించుతున్నాడా? అని కమ్ములా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
పైగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో కంటెంట్ కూడా యూనివర్శల్ గా కనెక్ట్ అయ్యేది కావడంతో లీడర్ తరహా అటెంప్ట్ అనే బలమైన సంకేతాలు వినిపిస్తున్నాయి. శేఖర్ కమ్ములా ఎలాంటి కథ చెప్పినా ఎంతో డీసెంట్ గా చెబుతారు. తనకంటూ ఓ స్టైల్ ఉందని నిరూపిస్తారు. ఈ సినిమా కూడా అదే తరహాలో సమాజాన్ని ప్రశ్నించేలా...సోసైటీలో అసమానతల్ని ఎత్తి చూపుతూ తనదైన మార్క్ ఎంటర్ టైనర్ గా తీర్చి దిద్దుతారు.
రానా ప్రధాన పాత్రలో 'లీడర్' చిత్రాన్ని ఎంత క్లాస్ గా తీసారో తెలిసిందే. అది అప్పట్లోనే ఓ సంచలనం. రాజకీయ వర్గాల్లో అంతకు మించి పెను సంచలనం రేపిన సినిమా ఇది. కమర్శియల్ గా వర్కౌట్ కానప్పటికీ ఓ గొప్ప చిత్రంగా విమర్శకులు ప్రశంసలందుకుంది. అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. పాన్ ఇండియా రిలీజ్ లు లేవు. ఈ నేపథ్యంలో అదే తరహా పాయింట్ తో ధనుష్ 51తో మరో ప్రయత్నం చేస్తున్నట్లు మీడియాలో ఫోకస్ అవుతుంది. 'లీడర్' లా సినిమా తీస్తే గనుక పాన్ ఇండియాలో పెద్ద సంచలనమే అవుతుంది. శేఖర్ కమ్ములా స్టోరీ సహా పాత్రల్ని తెరపై ఆవిష్కరించే విధానం ఎంతో వైవిథ్యంగా.. సహజత్వంతో కనిపిస్తుందని చెప్పాల్సిన పనిలేదు.