డాకు ఆర్మీ అన్ స్టాపబుల్ ప్రోమో అదిరిందిగా..!
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఈ సీజన్ లో ఆల్రెడీ ఇప్పటికే స్టార్స్ అంతా వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు.
By: Tupaki Desk | 31 Dec 2024 7:57 AM GMTనందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఈ సీజన్ లో ఆల్రెడీ ఇప్పటికే స్టార్స్ అంతా వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఎప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూస్ కి రాని విక్టరీ వెంకటేష్ కూడా రీసెంట్ గా అన్ స్టాపబుల్ షోకి వచ్చి ఫ్యాన్స్ ని అలరించారు. ఇక లేటెస్ట్ గా డాకు మహారాజ్ టీం తో అన్ స్టాపబుల్ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. దీనికి సంబందించిన ప్రోమో లేటెస్ట్ గా రిలీజైంది.
ప్రోమో విషయానికి వస్తే కె.ఎస్ బాబీని డైరెక్టర్ గారు షర్ట్ మీద షర్ట్ వేశారంటూ బాబీని అనగా నిర్మాత నాగ వంశీ కూడా వచ్చారు. వీరిద్దరితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. థమన్ వచ్చే టైం లో బల్బ్ లు అలా సౌండ్ చేస్తూ ఆగి వెలిగాయి. బాలయ్య, థమన్ కాంబోలో బిజిఎం కు థియేటర్ లో స్పీకర్లు బద్ధలు అవుతున్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇక ప్రతిసారి అందరినీ మీరు చేయడం కాదు మిమ్మల్ని మేము చేస్తామని డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ, నాగ వంశీ, థమన్ బాలకృష్ణని రివర్స్ లో ప్రశ్నలు అడిగారు. ఐతే దానికి నా సీటుకి ఎసరు పెట్టేలా ఉన్నారని బాలయ్య అన్నాడు. ఇక మరోపక్క ఫ్యామిలీతో టైం ఇష్టమా, మ్యాషన్ హౌస్ తో టైం ఇష్టమా అంటే.. పగలు ఒకళ్లని ప్రేమిస్తాను.. రాత్రి ఒకళ్లని ప్రేమిస్తాను అని సమాధానం ఇచ్చారు.
షోలో భాగంగా థమన్ గురించి ఇంటర్నేషనల్ లెవెల్ లో సీక్రెట్స్ గురించి ప్రస్తావిద్దామని సరదాగా అన్నారు. బాబీ చెబుతున్న విషయాల గురించి థమన్ మీకు కాదు ఆయనకు బిజిఎం ఇవ్వాలని థమన్ బాలయ్యతో అన్నారు. ఇక స్పీకర్స్ రెడీ చేసుకోండి డాకు మహారాజ్ వస్తున్నాడని థమన్, బాలకృష్ణ అన్నారు. సో డాకు మహారాజ్ స్పెషల్ ఎపిసోడ్ సూపర్ ఎంటర్టైనింగ్ గా రాబోతుంది. ప్రోమోలోనే ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఈ ఎపిసోడ్ తప్పకుండా నందమూరి ఫ్యాన్స్ ని అలరిస్తుందని చెప్పొచ్చు. మన డాకు ఆర్మీ అంటూ డాకు మహారాజ్ బాలయ్య అన్ స్టాపబుల్ స్పెషల్ ఎపిసోడ్ జనవరి 3న రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనుంది.