Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్‌పై 'డాకు మహారాజ్' దూకుడు: బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా!

నటసింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుంటోంది

By:  Tupaki Desk   |   20 Jan 2025 10:41 AM GMT
బాక్సాఫీస్‌పై డాకు మహారాజ్ దూకుడు: బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా!
X

నటసింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుంటోంది. భారీ హైప్‌తో విడుదలైన ఈ సినిమా, అభిమానులను అలరిస్తూ, తొలివారంలోనే భారీ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం రెండవ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా, విజయవంతంగా మంచి కలెక్షన్లను కొనసాగిస్తోంది.

ఈ సినిమా ప్రారంభమైన రోజు భారీ కలెక్షన్లతో దుమ్ము రేపింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లోనే ₹25.72 కోట్లు షేర్‌ను రాబట్టింది. రెండవ రోజు నుంచి కొంత తగ్గినా, వారం మొత్తానికి దాదాపు ₹63.79 కోట్ల షేర్‌ను తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సంపాదించింది. మొత్తం గ్రాస్ వసూళ్లు ₹98.65 కోట్లుగా నమోదయ్యాయి, ఇది బాలకృష్ణ కెరీర్‌లో మరో ముఖ్యమైన మార్క్ అని చెప్పవచ్చు.

డాకు మహారాజ్ 8 రోజుల కలెక్షన్లు (తెలుగు రాష్ట్రాల్లో):

1. మొదటి రోజు: ₹25.72 కోట్లు

2. రెండవ రోజు: ₹9.61 కోట్లు

3. మూడవ రోజు: ₹9.02 కోట్లు

4. నాల్గవ రోజు: ₹7.21 కోట్లు

5. ఐదవ రోజు: ₹4.78 కోట్లు

6. ఆరవ రోజు: ₹3.10 కోట్లు

7. ఏడవ రోజు: ₹2.31 కోట్లు

8. ఎనిమిదవ రోజు: ₹2.04 కోట్లు

మొత్తం తెలుగు రాష్ట్రాల్లో: ₹63.79 కోట్లు (గ్రాస్ ₹98.65 కోట్లు)

తెలుగు రాష్ట్రాల తోపాటు కర్ణాటక, ఇతర ప్రాంతాలు, విదేశీ మార్కెట్‌లో కూడా డాకు మహారాజ్ సత్తా చాటుతోంది. నైజాంలో ₹13.89 కోట్లు, సీడెడ్‌లో ₹11.51 కోట్లు, ఆంధ్ర ప్రాంతాల్లో మొత్తం ₹38 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. విదేశీ మార్కెట్‌లో ఈ చిత్రం దాదాపు ₹7.80 కోట్లు వసూలు చేయడం విశేషం. మొత్తంగా 8 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹75.41 కోట్ల షేర్ సాధించగా, ₹123.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది.

సినిమా మొత్తం బిజినెస్ లక్ష్యాన్ని పరిశీలిస్తే, ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా 92% రికవరీ సాధించింది. ఇంకా 6.59 కోట్ల రేంజ్ షేర్‌ను రాబట్టాలి. శని, ఆదివారాల్లో వచ్చిన కలెక్షన్లతో ఈ లక్ష్యం సులభంగా అందుకోగలదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదే సమయంలో బాలకృష్ణ మాస్ ఇమేజ్, అభిమానుల మద్దతు ఈ సినిమాను మరింతగా ముందుకు నడిపిస్తోంది. 'డాకు మహారాజ్' విజయంతో బాలకృష్ణ తన ఫాంను కొనసాగిస్తూ, మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించడమే కాకుండా, డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద ఊరటనిచ్చే ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశముంది.

ప్రపంచవ్యాప్తంగా: ₹75.41 కోట్లు (గ్రాస్ ₹123.45 కోట్లు)

డాకు మహారాజ్ మూవీ 8 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు

నైజాం: ₹13.89 కోట్లు

సీడెడ్: ₹11.51 కోట్లు

ఉత్తరాంధ్ర: ₹9.97 కోట్లు

ఈస్ట్ గోదావరి: ₹6.85 కోట్లు

వెస్ట్ గోదావరి: ₹5.07 కోట్లు

గుంటూరు: ₹7.88 కోట్లు

కృష్ణా: ₹5.27 కోట్లు

నెల్లూరు: ₹3.35 కోట్లు

ఏపీ-తెలంగాణ మొత్తం: ₹63.79 కోట్లు (గ్రాస్: ₹98.65 కోట్లు)

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: ₹3.82 కోట్లు

విదేశీ మార్కెట్: ₹7.80 కోట్లు

మొత్తం వరల్డ్ వైడ్ షేర్: ₹75.41 కోట్లు (గ్రాస్: ₹123.45 కోట్లు)