డాకు మహరాజ్ సెంచరీ.. బాలయ్యకు ఇది నాలుగోసారి!
ఈ మార్క్‌ను సీనియర్ హీరోల్లో సాధించిన ఘనతను బాక్సాఫీస్ రికార్డ్స్ లో మరింత పటిష్టం చేశారు.
By: Tupaki Desk | 16 Jan 2025 9:55 AM GMTనందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో మరో రికార్డ్ ను అందుకున్నాడు. అఖండతో బాక్సాఫీస్ రేసులో మళ్లీ నిలబడిన బాలయ్య, వరుస విజయాలతో తన మాస్ స్టామినాను నిరూపించారు. డాకు మహారాజ్ సినిమాతో ఇప్పుడు ఆయన 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి నాలుగో సారిగా చేరారు. ఈ మార్క్‌ను సీనియర్ హీరోల్లో సాధించిన ఘనతను బాక్సాఫీస్ రికార్డ్స్ లో మరింత పటిష్టం చేశారు.
తెలుగు చిత్రసీమలో సీనియర్ హీరోల మధ్య 100 కోట్ల గ్రాస్ మార్క్ అనేది చాలా అరుదైన విషయం. బాలయ్య ఇప్పుడు అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి తర్వాత డాకు మహారాజ్ తో నాలుగో సారిగా ఈ క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఈ కలెక్షన్లు మాత్రమే కాకుండా, మాస్ ఆడియన్స్‌లో ఆయన స్టార్డమ్ మరో స్థాయికి చేరింది. డాకు మహారాజ్ సినిమా మంచి ఓపెనింగ్స్‌తోనే బాక్సాఫీస్‌ను శాసించింది.
మొదటి నాలుగు రోజుల్లోనే 105 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకోవడం విశేషం. బాలయ్య కెరీర్‌లో ఇంత వేగంగా ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన సినిమా ఇదే. దానికి బాబీ దర్శకత్వం, థమన్ మ్యూజిక్, మాస్ ఎలివేషన్ సీన్లు ప్రధాన కారణాలుగా నిలిచాయి. సినిమా విడుదలకు ముందు నుంచే బాలయ్యపై ఉన్న క్రేజ్, ట్రైలర్‌కు వచ్చిన స్పందన సినిమాకు మంచి బలాన్ని ఇచ్చాయి.
సంక్రాంతి పండుగ సీజన్ ఈ సినిమా వసూళ్లను మరింతగా పెంచేందుకు దోహదపడింది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, ఈ సినిమా లాంగ్ రన్‌లో కూడా బాలయ్యకు పెద్ద హిట్‌గా నిలవొచ్చని భావిస్తున్నారు. బాలయ్య ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి రికార్డులను సమం చేయడమే కాకుండా, వరుసగా నాలుగు సినిమాలతో 100 కోట్ల క్లబ్ చేరిన ఘనతను అందుకున్నారు. ఇది చిరు కూడా సాధించని రికార్డ్ కావడం విశేషం.
ఈ రికార్డులతో బాలయ్య తన మాస్ హీరో ఇమేజ్‌ను మరింత బలపర్చారు. అఖండ 2 చిత్రానికి బాలయ్య ఇప్పటి క్రేజ్‌ను ఇంకా కొనసాగిస్తారని అందరూ ఆశిస్తున్నారు. డాకు మహారాజ్ లాంగ్ రన్‌లో ఇంకా ఎంతవరకు వసూళ్లు సాధిస్తుందో, అది బాలయ్య కెరీర్‌లో ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. ఫైనల్ గా ఈ రికార్డులతో బాలయ్య తన మాస్ హీరో స్టేటస్‌ను మరింత బలపరచడంలో విజయం సాధించారు.