మినిస్టర్ అల్లుడు గెస్ట్ గా డాకు మహారాజ్ ఈవెంట్..!
సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రోమోస్ అన్ని అదిరిపోయాయి.
By: Tupaki Desk | 8 Jan 2025 9:35 AM GMTనందమూరి బాలకృష్ణ బాబీ కాంబో లో వస్తున్న డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించారు. థమన్ సంగీతం అందించిన ఈ మూవీలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా హీరోయిన్స్ గా నటించారు. సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రోమోస్ అన్ని అదిరిపోయాయి.
డాకు మహారాజ్ కోసం ఈమధ్యనే డల్లాస్ లో ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. అక్కడ ఉన్న నందమూరి ఫ్యాన్స్ అందరు ఈ ఈవెంట్ లో సూపర్ ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు మన దగ్గర ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఇంకా టైమ్ ఫిక్స్ చేశారు. ఈసారి డాకు మహారాజ్ ఈవెంట్ రాయలసీమ లో చేస్తున్నారు. బాలకృష్ణ సినిమాలకు అక్కడ సూపర్ క్రేజ్ ఉంటుంది.. బాలయ్య చేసే యాక్షన్ సినిమాలకు అక్కడ ఒక రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ఈసారి అనంతపురం లో డాకు మహారాజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు.
జనవరి 9 సాయంత్రం 5 గంటలకు అనంతపురం శ్రీ నగర్ కాలనీ లో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కి ఛీఫ్ గెస్ట్ గా నారా వారసుడు బాలకృష్ణ అల్లుడు ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ నారా లోకేష్ అటెండ్ అవుతున్నారు.. దీనికి సంబందించిన అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బాలయ్య సినిమా ఈవెంట్ కి మినిస్టర్ లోకేష్ గెస్ట్ గా రావడం సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు.
ఈ వేదిక మీద మామ బాలకృష్ణ గురించి మినిస్టర్ అల్లుడు నారా లోకేష్ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తి కరంగా మారింది. డాకు మహారాజ్ టీమ్ మాత్రం ఈ ఈవెంట్ ని చాలా స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఫ్యాన్స్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్ లో అటు బాలయ్య ఇటు లోకేష్ మామ అల్లుళ్ల హంగామాతో నందమూరి ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పొచ్చు. బాలయ్య కెరీర్ లోనే హయ్యెస్ట్ బిజినెస్ చేసిన డాకు మహారాజ్ మీద భారీ హోప్స్ ఉన్నాయి. మరి సినిమా ఏం చేస్తుంది అన్నది చూడాలి.ఫ్యాన్స్ మాత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ డాకు మహారాజే అని ఫిక్స్ అయ్యారు.