డల్లాస్ లో డాకు మహారాజ్ హై వోల్టేజ్ వైబ్
తాజాగా యూఎస్ లో డల్లాస్ వేదికగా ‘డాకు మహారాజ్’ ప్రీరిలీజ్ నిర్వహించారు.
By: Tupaki Desk | 5 Jan 2025 5:53 AM GMTనందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ జనవరి 12న థియేటర్స్ లోకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్ ప్రస్తుతం నడుస్తున్నాయి. తాజాగా యూఎస్ లో డల్లాస్ వేదికగా ‘డాకు మహారాజ్’ ప్రీరిలీజ్ నిర్వహించారు.
దానికి సంబందించిన ఫోటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ‘గేమ్ చేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ డల్లాస్ లో నిర్వహించారు. దాని తర్వాత ఇప్పుడు ‘డాకు మహారాజ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి డాల్లస్ వేదికగా మారింది. గ్రాండ్ గా జరిగిన ఈ ఈవెంట్ లో బాలయ్యతో పాటు ఇతర క్యాస్టింగ్ అండ్ క్రూ అందరూ పాల్గొన్నారు.
భారీ సంఖ్యలో నందమూరి అభిమానులు, తెలుగు సినీప్రియులు హాజరయ్యారు. కలర్ ఫుల్ నైట్ లో జరిగిన ఈ ఈవెంట్ లో బాలయ్య సినిమా గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నందమూరి అభిమానులు ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే ‘డాకు మహారాజ్’ ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. బాలకృష్ణ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేసినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది. రెండు టైం లైన్స్ లలో ఈ మూవీ కథ నడుస్తున్నట్లు ఉంది. ‘డాకు మహారాజ్’ కథ ఒకటి, అలాగే మరో బాలకృష్ణ స్టోరీస్ ని సిమిలారిటీగా నడిపిస్తూ కథని పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరపై ఆవిష్కరించారు. ‘యానిమల్’ తర్వాత బాబీ డియోల్ కి ఈ చిత్రంలో పవర్ ఫుల్ దొరికినట్లు ఉంది.
ఇదిలా ఉంటే శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించారు. బాబీ డియోల్ తో పాటు మరికొంత మంది స్టార్ యాక్టర్స్ విలన్స్ గా కనిపిస్తున్నారు. బాలయ్య నుంచి ఆడియన్స్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, అదిరిపోయే పవర్ ఫుల్ డైలాగ్స్ కోరుకుంటారు.
ఈ చిత్రంలో అలాంటి యాక్షన్ సీక్వెన్స్ చాలా ఉన్నాయి. ఇక ‘డాకు మహారాజ్’ నందమూరి అభిమానులకి పొంగల్ ఫీస్ట్ అందించడం గ్యారెంటీ అనుకుంటున్నారు. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలకృష్ణ నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై బిజినెస్ కూడా భారీగానే జరిగింది. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి సక్సెస్ అందుకుంటాడనేది చూడాలి.