డాకు మహారాజ్ - గేమ్ ఛేంజర్.. బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే..
ఇది మొదటి రోజు వసూళ్లతో పోలిస్తే 50% తగ్గుదల అయినప్పటికీ, మంచి హోల్డ్ లోనే ఉందని చెప్పవచ్చు.
By: Tupaki Desk | 14 Jan 2025 6:33 AM GMTనందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద మాస్ హవాను కొనసాగిస్తోంది. మొదటి రోజు రూ.30 కోట్ల గ్రాస్‌ను రాబట్టి బాలయ్య కెరీర్‌లో రెండవ అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచిన ఈ చిత్రం, రెండవ రోజు కూడా అదే జోరును కొనసాగించింది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు రూ.13-15 కోట్ల మధ్య వసూళ్లు సాధించినట్లు అంచనా వేస్తున్నారు. ఇది మొదటి రోజు వసూళ్లతో పోలిస్తే 50% తగ్గుదల అయినప్పటికీ, మంచి హోల్డ్ లోనే ఉందని చెప్పవచ్చు.
సోమవారం (మూడవ రోజు) డాకు మహారాజ్ గ్రాస్ వసూళ్లు రూ.15-17 కోట్లుగా ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనితో ఈ చిత్రం రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా మొత్తం రూ.45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. సంక్రాంతి పండుగ సీజన్‌లో ఈ సినిమాకు మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. పండగ సీజన్ ముగిసేలోపు ఈ చిత్రం రూ.100 కోట్ల మార్క్‌ను అందుకునే అవకాశం ఉంది.
గేమ్ ఛేంజర్ కలెక్షన్స్..
ఇదిలా ఉంటే, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా పరిస్థితి భిన్నంగా ఉంది. తొలిరోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, తర్వాతి రోజుల నుంచి సినిమా వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. నాల్గవ రోజు (సోమవారం) దేశవ్యాప్తంగా సినిమా రూ.10 కోట్ల గ్రాస్‌ను మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ.6-7 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, హిందీ వెర్షన్ పరంగా కూడా గేమ్ ఛేంజర్ భారీ కలెక్షన్స్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. వీకెండ్‌లో హిందీ వెర్షన్ కొంత మేరకు మెరుగైన వసూళ్లు రాబట్టినప్పటికీ, సోమవారం వసూళ్లు రూ.1.50-1.75 కోట్ల మధ్యనే నిలిచాయి. నాలుగు రోజుల తర్వాత మొత్తం రూ.115 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే ఈ చిత్రం సాధించింది. సంక్రాంతి సెలవులు వచ్చినా, గేమ్ ఛేంజర్ విజయానికి ఇది తగినంత కాలం కాదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
వసూళ్ల వివరాలు (గ్రాస్):
డాకు మహారాజ్
AP & TG: ₹10.48 కోట్లు (Day 2)
మొత్తం భారత్: ₹11.48 కోట్లు (Day 2)
గేమ్ ఛేంజర్
AP & TG: ₹5.43 కోట్లు (Day 4)
మొత్తం భారత్: ₹8.19 కోట్లు (Day 4)