పుష్ప 2 ఎఫెక్ట్... డాకు మహారాజ్‌కి బిగ్ రిలీజ్!
గత నెలలో ప్రేక్షకలు ముందుకు వచ్చిన పుష్ప సూపర్ హిట్‌గా నిలిచింది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.1900 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి
By: Tupaki Desk | 24 Jan 2025 8:01 AM GMTగత నెలలో ప్రేక్షకలు ముందుకు వచ్చిన పుష్ప సూపర్ హిట్‌గా నిలిచింది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.1900 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. నార్త్ ఇండియా నుంచి ఈ సినిమా దాదాపుగా రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఒక ఇండియన్ సినిమా ఎప్పుడూ రాబట్టని వసూళ్లు పుష్ప 2 ఉత్తర భారతంలో దక్కించుకుంది. తెలుగు సినిమాలంటే అక్కడి ప్రేక్షకులకు మరింత క్రేజ్ క్రియేట్ అయ్యే విధంగా పుష్ప 2 సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. పుష్ప 2 సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తెలుగు నుంచే వెళ్లిన డాకు మహారాజ్ సినిమాకు అక్కడ మంచి రిలీజ్ దక్కింది.
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాకు మంచి టాక్ దక్కింది. రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో వెంటనే హిందీలో రిలీజ్ చేయాలని భావించారు. తెలుగులో విడుదల అయిన తర్వాతే హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లాలి అనే ఉద్దేశ్యంతో డబ్బింగ్ పనులు మొదలు పెట్టారు. సినిమాను జెట్ స్పీడ్‌గా డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ చేశారు. నేడు హిందీలో డాకు మహారాజ్ సినిమా విడుదల అయ్యింది. వంద రెండు వందల థియేటర్‌లలో కాకుండా ఏకంగా 500 నుంచి 600 థియేటర్‌లలో ఈ సినిమాను విడుదల చేసినట్లుగా సమాచారం అందుతోంది.
పుష్ప 2 సినిమా జోరు తగ్గింది. మెల్ల మెల్లగా అక్కడ పుష్ప 2 రాబట్టిన వసూళ్లు రికార్డ్‌లను సృష్టించాయి. ఇంకా పుష్ప 2 గురించిన చర్చ జరుగుతూనే ఉన్న సమయంలో డాకు మహారాజ్ సినిమా విడుదల కావడంతో హిందీ ప్రేక్షకులు ఈ సినిమాపైనా ఆసక్తి కనబర్చే అవకాశాలు ఉన్నాయి. డాకు మహారాజ్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి విడుదల చేయడం జరిగింది. హిందీ ప్రేక్షకుల ముందుకు ఎక్కువ థియేటర్‌ల ద్వారా తీసుకు వెళ్లడం వల్ల ఓపెనింగ్ మినిమం ఉండే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మినిమం వసూళ్లు రాబట్టినా లాంగ్ రన్‌లో డాకు మహారాజ్ సినిమా రూ.200 కోట్ల వసూళ్ల మార్క్‌ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు. డాకు మహారాజ్ సినిమాతో నాల్గవ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అని విడుదలకు ముందు నుంచే ప్రచారం జరిగింది. అన్నట్లుగానే బాలకృష్ణకు మరో విజయం దక్కింది. వరుసగా నాలుగు సినిమాలతో సక్సెస్ దక్కించుకున్న హీరోలు ఈమధ్య కాలంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. అలాంటి జాబితాలో బాలకృష్ణకు చోటు దక్కింది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి మంచి స్పందన దక్కింది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ నిర్మించారు.