డాకు మహారాజ్: యుఎస్‌లో $1 మిలియన్ మార్క్
నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 13 Jan 2025 6:23 AM GMTనందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాబీ కోల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. థమన్ సంగీతం, బాలయ్య మాస్ స్టామినా, బాబీ స్టైల్ డైరెక్షన్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు నుంచే మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా, విదేశాల్లో కూడా బాగా పాజిటివ్ రెస్పాన్స్‌ను సాధిస్తోంది. ముఖ్యంగా యుఎస్ బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ మంచి వసూళ్లను రాబట్టింది. ప్రేక్షకుల్లో బాలయ్య మాస్ ఫాలోయింగ్ ఎంత ఉందో ఈ సినిమా ద్వారా మరోసారి స్పష్టమైంది. యూఎస్ లో ప్రత్యేకంగా ప్రమోషన్ చేసిన విషయం తెలిసిందే.
ఇక యుఎస్‌లో ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక జెట్ స్పీడ్ లోనే $1 మిలియన్ కలెక్షన్ రికార్డ్ అందుకోవడం విశేషం. డాకు మహారాజ్ సినిమా యుఎస్ మార్కెట్‌లో బలంగా నిలబడుతూ, $1 మిలియన్ గ్రాస్‌ను దాటింది. ఇటీవల కాలంలో బాలకృష్ణ సినిమాలకు యుఎస్‌లో మంచి మార్కెట్ ఏర్పడింది. టాక్ ఎలా ఉన్నప్పటికీ, బాలయ్య సినిమాలు మాస్ ఎలిమెంట్స్ కారణంగా ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తున్నాయి.
ఈ రికార్డ్ బాలయ్య క్రేజ్ అంతా ఏకఛాటిగా కొనసాగుతుందనే దానికి నిదర్శనం. యుఎస్ ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ డాకు మహారాజ్ బాక్సాఫీస్ రన్‌ను మరింత స్ట్రాంగ్ చేసింది. సంక్రాంతి పండుగ సీజన్‌ను పురస్కరించుకుని, ఈ మాస్ ఎంటర్టైనర్ మరిన్ని వసూళ్లను రాబట్టే అవకాశముంది. అలాగే, ఫ్యామిలీ ఆడియన్స్ సైతం సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్తుండటంతో కలెక్షన్లు ఇంకా పెరగవచ్చని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
థమన్ నేపథ్య సంగీతం, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. బాబీ తీసుకున్న కథ, స్క్రీన్ ప్లే కూడా బలంగా ఉండటంతో సినిమా మంచి రన్‌ను కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే, సంక్రాంతి బరిలో డాకు మహారాజ్ నిలబడి మరిన్ని రికార్డులు సృష్టించగలదా? అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు గేమ్ ఛేంజర్ అయితే అంతగా క్లిక్కవ్వలేదు. ఇక రేపు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా రానుంది. మరి ఈ క్లాష్ లో డాకు మహరాజ్ ఇంకా ఎలాంటి రికార్డులు అందుకుంటుందో చూడాలి.