'డాకు మహారాజ్' ఏ ఓటీటీలో రానుందో తెలుసా!
బాలకృష్ణ, బాబీ కాంబోలో రూపొందిన డాకు మహారాజ్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 14 Jan 2025 1:30 AM GMTబాలకృష్ణ, బాబీ కాంబోలో రూపొందిన డాకు మహారాజ్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా మొదటి రోజే ఈ సినిమా దాదాపుగా రూ.25 కోట్ల షేర్‌ని కలెక్ట్ చేయడంతో ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధించడం మాత్రమే కాకుండా బాలకృష్ణ కెరీర్‌లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని ఈ సినిమా సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. డాకు మహారాజ్ సినిమా ఈ సంక్రాంతి విజేత అంటూ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే సక్సెస్ వేడుకలు జరుపుకుంటున్నారు.
ఇక ఈ సినిమాకి దక్కిన హిట్ టాక్‌తో కొంత మంది సినీ ప్రేక్షకులు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. పెరిగిన టికెట్ల రేట్లు, ఇతర విషయాల కారణంగా చాలా మంది ఓటీటీ స్ట్రీమింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. థియేటర్ రిలీజ్ అయినా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలు థియేటర్ రిలీజ్ అయిన నాలుగు లేదా ఐదు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ మొదలు అవుతున్నాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేక పోతే వాటిని కేవలం మూడు వారాల్లోనే ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్న సందర్భాలను మనం చాలానే చూస్తూ ఉన్నాం.
డాకు మహారాజ్ సినిమా ఓటీటీలో ఎప్పుడు వచ్చేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నిర్మాత నాగవంశీ తో నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధుల ఒప్పందం పూర్తి అయ్యింది. సినిమాకు హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో భారీగానే గిట్టుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓటీటీ ద్వారా సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుంది. అయితే ఎన్ని వారాల తర్వాత అనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు. సినిమాకు హిట్ టాక్ వచ్చింది కనుక నాలుగు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కాకపోవచ్చు అంటున్నారు.
థియేటర్లకు జనాలు ఎక్కువ రావాలనే ఉద్దేశ్యంతో కాస్త ఆలస్యంగానే సినిమాను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేస్తారని తెలుస్తోంది. అతి త్వరలోనే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీపై మరింత స్పష్టత వస్తుందేమో చూడాలి. నందమూరి అభిమానులు మాత్రం థియేట్రికల్ రన్ పూర్తిగా క్లోజ్ అయిన తర్వాత మాత్రమే ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలి అనుకుంటే ఫిబ్రవరి రెండో వారాలో స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కలెక్షన్స్ బాగా ఉండి మూడు నాలుగు వారాల్లోనూ షేర్ బాగానే రాబడితే అప్పుడు ఫిబ్రవరి మూడో వారానికి ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.