'డాకు' ఓటీటీ.. నిజంగా ఆ సీన్స్ ను తీసేశారా?
హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బాబీ కొల్లి తెరకెక్కించిన ఆ సినిమా.. సంక్రాంతికి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.
By: Tupaki Desk | 20 Feb 2025 2:14 PM GMTటాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బాబీ కొల్లి తెరకెక్కించిన ఆ సినిమా.. సంక్రాంతికి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.
అయితే థియేటర్లలో సందడి చేసిన డాకు మహారాజ్ మూవీ.. మరికొద్ది గంటల్లో ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. ఆ సమయంలో అనగనగా ఒక రోజు.. అంటూ రాసుకొచ్చి ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.
కానీ అందులో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మిస్ అయింది. సినిమాలో కీలక పాత్ర పోషించి, దబిడి దిబిడి సాంగ్ తో ఉర్రూతలూగించిన ఊర్వశి ఫోటో పోస్టర్ లో లేకపోవడంపై అనేక మంది నెటిజన్లు స్పందించారు. కొందరు అసహనం వ్యక్తం చేశారు. ఇంకొందరు కామెడీగా క్వశ్చన్ చేశారు. దీంతో నెట్ ఫ్లిక్స్ రెస్పాండ్ అయింది.
క్యాస్టింగ్ అందరి పిక్స్ ను స్లైడ్స్ రూపంలో పోస్ట్ చేసింది. అందులో ఊర్వశి పిక్ రెండు సార్లు ఉంది. అయితే కొద్ది రోజులుగా నెట్ ఫ్లిక్స్.. సినిమాలో ఊర్వశి ఉన్న సీన్స్ ను తొలగించిందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఓటీటీ వెర్షన్ లో ఆమె ఉన్న సీన్స్ తోపాటు సాంగ్ ఉండదని ఊహాగానాలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అయితే అందులో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు తెలుస్తోంది. థియేట్రికల్ వెర్షన్ నే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుందని సమాచారం. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు నిరాధారమైనవని సమాచారం. నెట్‌ఫ్లిక్స్ మూవీ ఒరిజినల్ థియేట్రికల్ కట్‌కు కట్టుబడి ఉందని వినికిడి. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సినిమా విషయానికొస్తే.. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన డాకు మహారాజ్ లో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాధ్, చాందినీ చౌదరి, ప్రదీప్ రావత్, సచిన్ ఖేడేకర్, షైన్ టామ్ చాకో, విశ్వంత్ దుడ్డుంపూడి, ఆడుకలం నరేన్, రవి కిషన్, కీలక పాత్రల్లో నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మించారు. మరి ఓటీటీలో డాకు మహారాజ్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.