బాలయ్య ఊచకోత.. డాకు మహారాజ్ ట్రైలర్ ఎలా ఉందంటే?
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. డాకు మహారాజ్ మూవీతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 5 Jan 2025 4:37 AM GMTటాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. డాకు మహారాజ్ మూవీతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించగా.. బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. బాబీ డియోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషించగా.. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.
జనవరి 12వ తేదీన రిలీజ్ కానున్న డాకు మహారాజ్ మూవీ నుంచి ఇప్పటికే టీజర్, మూడు సాంగ్స్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే జోష్ తో మేకర్స్ ట్రైలర్ ను లాంఛ్ చేశారు. అమెరికాలోని డల్లాస్ లో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించి విడుదల చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అనగనగా ఒక రాజు ఉండేవాడు.. అంటూ ఓ చిన్న పాప చెబుతున్న కథతో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత గుర్రాలపై కొందరు వ్యక్తులు, రౌడీలను మేకర్స్ చూపించారు. చెడ్డ వాళ్లంతా ఆయన డాకు అనే వారు, మాకు మాత్రం మహారాజని చిన్నారి చెబుతుండగా.. బాలయ్య పవర్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత వేరే లెవెల్ యాక్షన్ సీన్స్ ను చూపించిన మేకర్స్.. మిగతా నటీనటులను పరిచయం చేశారు. అదే సమయంలో సినిమాలో బాలయ్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సినిమా ఉండనున్నట్లు క్లియర్ గా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. చిన్నారి ఎమోషన్ తో పాటు ప్రజలను కాపాడే హీరో వంటి జోనర్ లో తెరకెక్కినట్లు అర్థమవుతోంది.
అయితే బాలకృష్ణ యాక్టింగ్.. సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. యాక్షన్ సీన్స్ లో ఆయన పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్. నటసింహం ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడు అంటూ బాలయ్య గురించి ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోయాయి. అలా మూవీలో చాలా ఉన్నట్లు ఉన్నాయి.
మొత్తానికి చెప్పినట్లే.. బాలయ్యను నెవ్వర్ బిఫోర్ రోల్ లో బాబీ చూపించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రగ్యా జైస్వాల్ రోల్ పవర్ ఫుల్ గా ఉండనున్నట్లు కనిపిస్తుంది. బాబీ డియోల్ తన యాక్టింగ్ తో మెప్పించనున్నారని అర్థమవుతుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. అలా ఓవరాల్ గా ట్రైలర్ అందరినీ తెగ మెప్పిస్తోంది.