Begin typing your search above and press return to search.

డాకు మహారాజ్ ట్రెండింగ్.. ఏ లెవెల్లో ఉందంటే..

బుక్ మై షోలో ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ ని మేకర్స్ ట్విట్టర్ లో షేర్ చేశారు. బాలయ్య కెరియర్ లోనే అత్యధిక ఇంటెరెస్ట్స్ ఈ సినిమాకి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   7 Jan 2025 11:49 AM GMT
డాకు మహారాజ్ ట్రెండింగ్.. ఏ లెవెల్లో ఉందంటే..
X

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ జనవరి 12న థియేటర్స్ లోకి వస్తోంది. కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని బాబీ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారని టాక్. కచ్చితంగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించడం గ్యారెంటీ అని మేకర్స్ కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీకి సంబందించిన టికెట్ ధరలు ఏపీలో పెంచారు.

ప్రత్యేకంగా ప్రీమియర్ షోలు కూడా పడుతున్నాయి. సినిమా భారీ కలెక్షన్స్ కొల్లగొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకి బుక్ మై షోలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీకి బుక్ మై షోలో 200K ఇంటరెస్ట్స్ రావడం విశేషం. సంక్రాంతి రేసులో రిలీజ్ అయ్యే సినిమాలలో ‘డాకు మహారాజ్’ ఎక్కువ ట్రెండింగ్ లో ఉంది. మూడు సినిమాలకి సమానమైన హైప్ ఉన్న కూడా బాలయ్య మూవీ అనేసరికి మాస్ ఆడియన్స్ ఇంకాస్త ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు.

వారికి కావాల్సిన యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ బాలయ్య బాబు సినిమాలలో పుష్కలంగా ఉంటాయి. అందుకే రెగ్యులర్ ఆడియన్స్ కూడా బాలయ్య సినిమాలు సంక్రాంతి సీజన్ లో చూడటానికి ఇష్టపడతారు. 2023 సంక్రాంతి కానుకగా వచ్చిన బాలయ్య ‘వీరసింహారెడ్డి’ మంచి కమర్షియల్ హిట్ అయ్యింది. దాని తర్వాత ఈ ఏడాది డాకు మహారాజ్ గా ఆడియన్స్ ని అలరించడానికి ముందుకొస్తున్నాడు.

బుక్ మై షోలో ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ ని మేకర్స్ ట్విట్టర్ లో షేర్ చేశారు. బాలయ్య కెరియర్ లోనే అత్యధిక ఇంటెరెస్ట్స్ ఈ సినిమాకి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తూ ఉన్నారు. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటించారు. ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించారు. వారి పాత్రలు మూవీలో చాలా కీలకంగా ఉంటాయని తెలుస్తోంది.

జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఏపీలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రాండ్ గా ఈ ఈవెంట్ చేయాలని అనుకుంటున్నారు. త్వరలో దీనిపై స్పష్టత రావొచ్చు. ఇప్పటికే మూవీకి టికెట్ ధరలు కూడా పెంచిన నేపథ్యంలో ఏపీలో డాకుకి భారీ కలెక్షన్స్ వస్తాయని అనుకుంటున్నారు.