Begin typing your search above and press return to search.

థియేటర్‌లో డాకు శివ తాండవం ఖాయం

తాజాగా ఈ సినిమా నిర్మాత నాగవంశీ ఎక్స్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. నాగవంశీ మాట్లాడుతూ... ఇప్పుడే డాకు మహారాజ్ సినిమాను చూశాను.

By:  Tupaki Desk   |   31 Dec 2024 7:17 AM GMT
థియేటర్‌లో డాకు శివ తాండవం ఖాయం
X

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీకున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతికి రాబోతున్న గేమ్‌ ఛేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు ఈ సినిమా గట్టి పోటీగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టీజర్ విడుదల తర్వాత అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు బాబీ ఈ సినిమాను ఫుల్‌ లెంగ్త్‌ కమర్షియల్‌ మాస్ బ్లాక్ బస్టర్‌గా రూపొందించాడు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

తాజాగా ఈ సినిమా నిర్మాత నాగవంశీ ఎక్స్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. నాగవంశీ మాట్లాడుతూ... ఇప్పుడే డాకు మహారాజ్ సినిమాను చూశాను. తమన్‌ ఈ సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ కచ్చితంగా జీవితకాలపై అనుభూతిని అందిస్తుంది. అతడి బెస్ట్‌ వర్క్‌లో ఇది ఒకటి అంటూ నాగవంశీ చెప్పుకొచ్చాడు. థియేటర్స్‌లో డాకు మహారాజ్‌ సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ వింటే శివ తాండవం అనిపిస్తుందని నాగవంశీ హైప్‌ ఇచ్చే విధంగా కామెంట్‌ పోస్ట్‌ చేశారు. తన సినిమా గురించి నాగవంశీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మనం కామన్‌గానే చూస్తూ ఉంటాం. అయితే తమన్‌ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ గురించి ఇక్కడ స్పెషల్‌గా నాగవంశీ పేర్కొన్నారు.

గతంలో అఖండ సినిమా కోసం తమన్‌ ఇచ్చిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. బాలకృష్ణ మాస్‌ సన్నివేశాలకు తమన్‌ అంతే స్థాయి మాస్ మ్యూజిక్ ఇస్తాడని అఖండ సినిమాతో నిరూపితం అయ్యింది. బాక్స్‌లు బద్దలు అయ్యే విధంగా బీజీఎం ఇచ్చిన తమన్‌ మరోసారి అదే స్థాయిలో డాకు మహారాజ్ కి సంగీతాన్ని అందించి ఉంటాడని మొదటి నుంచి చాలా మంది నమ్మకంగా ఉన్నారు. పాటల విషయంలో ఫలితం ఎలా ఉన్నా బాలకృష్ణ, తమన్‌ల కాంబో మూవీ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ పైసా వసూళ్‌ అన్నట్లుగా ఉంటుంది అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్‌ మూవీస్ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాలకు తమన్ సంగీతాన్ని అందించి సూపర్‌ హిట్‌లో భాగస్వామ్యం అయ్యారు. ఇప్పుడు వీరి కాంబోకు డబుల్‌ హ్యాట్రిక్ దక్కబోతుంది. ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్‌ హీరోయిన్‌గా నటించగా శ్రద్ద శ్రీనాథ్‌, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ ఈ సినిమాలో విలన్‌గా నటించారు. సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు హై తెప్పించే విధంగా ఉంటుందని, ఇంటర్వెల్‌కి ముందు సన్నివేశాలు సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయని నాగవంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.