డల్లాస్ పురంలో 'డాకు మహారాజ్'.. ఇక తిరుగులేనట్లే!
ఇప్పుడు నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ ఈవెంట్ కూడా డల్లాస్ లో జరగనున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 14 Dec 2024 4:29 AM GMTడల్లాస్ పురం.. అదేనండీ డల్లాస్.. అమెరికా మొత్తంలో తెలుగు వారు ఎక్కువగా నివసించేది అక్కడేనన్న విషయం తెలిసిందే. అందుకే సోషల్ మీడియా లో ఆ ప్రాంతాన్ని డల్లాస్ పురం అని అంటుంటారు. అక్కడ టాలీవుడ్ చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. తెలుగు సినిమాలు వేరే లెవెల్ లో రెస్పాన్స్ దక్కించుకుంటూ అలరిస్తుంటాయి.
అందుకే అనేక మంది టాలీవుడ్ యాక్టర్స్.. సినిమా హిట్ అయ్యాక డల్లాస్ వెళ్లి థియేటర్ విజిట్స్, ఫ్యాన్స్ మీట్స్ లో సందడి చేస్తుంటారు. ఇప్పుడు ఏకంగా మూవీ ఈవెంట్స్ ను పలు సినిమాల మేకర్స్ అక్కడ నిర్వహించబోతున్నారు. దీంతో ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నారు. తద్వారా మరిన్ని వసూళ్లు రాబట్టేలా చేయనున్నారు.
అయితే 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల్లో ఒకటైన గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డిసెంబర్ 21వ తేదీన డల్లాస్ లో నిర్వహించబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. చాలా గ్రాండ్ గా జరగనున్న ఆ వేడుకకు హీరో రామ్ చరణ్ తో పాటు స్టార్ డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు.
ఇప్పుడు నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ ఈవెంట్ కూడా డల్లాస్ లో జరగనున్న విషయం తెలిసిందే. జనవరి 4న డల్లాస్ లో ఈవెంట్ జరుగుతుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో మేకర్స్ బిజీగా ఉన్నారు. బాలయ్య సహా సినిమా క్యాస్టింగ్ అంతా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
అయితే బాలయ్య నటించిన అన్ని సినిమాలు.. యూఎస్ లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మంచి వసూళ్లు దక్కించుకుంటాయి. అదే ఇప్పుడు ఏకంగా ఆయనే వెళ్లి అక్కడ సినిమాను ప్రమోట్ చేస్తే.. ఇక తిరుగు లేనట్లే. ఇప్పటికే ఈవెంట్ కు అటెండ్ అయ్యేందుకు డల్లాస్ పురం బాలయ్య ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇక డాకు మహరాజ్ మూవీ విషయానికొస్తే.. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. జనవరి 12వ తేదీన విడుదల కానుంది. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, ప్రగ్యా జైస్వాల్, చాందిని చౌదరి ఫిమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. తమన్ పవర్ ఫుల్ మ్యూజిక్ అందిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ప్రోమో ద్వారా అది క్లారిటీ వచ్చేసింది. మరి ఓవరాల్ మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.