Begin typing your search above and press return to search.

ఎక్స్‌ట్రా కంటెంట్‌తో ఓటీటీలోకి డాకు మ‌హారాజ్

అయితే థియేట్రిక‌ల్ ర‌న్ ను ముగించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయినట్టు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   10 Feb 2025 11:14 AM GMT
ఎక్స్‌ట్రా కంటెంట్‌తో ఓటీటీలోకి డాకు మ‌హారాజ్
X

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన తాజా చిత్రం డాకు మ‌హారాజ్ మంచి హిట్ గా నిలిచింది. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ లో ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్ గా న‌టించగా శ్ర‌ద్ధా శ్రీనాథ్ కీల‌క పాత్ర‌లో న‌టించింది. బాలీవుడ్ స్టార్ న‌టుడు బాబీ డియోల్ డాకు మ‌హారాజ్ లో విల‌న్ గా క‌నిపించి మ‌రోసారి మెప్పించాడు.

సంక్రాంతి కానుక‌గా థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌నే రాబ‌ట్టుకుంది. అయితే థియేట్రిక‌ల్ ర‌న్ ను ముగించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయినట్టు తెలుస్తోంది. డాకు మ‌హారాజ్ సినిమా వ‌చ్చే వారం నుంచి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే డాకు మ‌హారాజ్ ఓటీటీ వెర్ష‌న్ కోసం వెయిట్ చేస్తున్న బాల‌య్య ఫ్యాన్స్ కు ఓ స్వీట్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతోంద‌ట నెట్ ఫ్లిక్స్. డాకు మ‌హారాజ్ సినిమా మ‌రికొంత కొత్త కంటెంట్ తో ఓటీటీలోకి రాబోతున్న‌ట్టు తెలుస్తోంది. థియేట‌ర్ల‌లో చూడ‌ని డాకు మ‌హారాజ్ లోని ఓ సాంగ్ ను డైరెక్ట్ గా ఓటీటీ కంటెంట్ లో రిలీజ్ చేయ‌నున్నార‌ట‌.

ఏదేమైనా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో తెలుగు సినిమాల‌ను అడిష‌నల్ ఫుటేజ్ తో రిలీజ్ చేయ‌డం ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది. రీసెంట్ గా పుష్ప‌2 విష‌యంలో కూడా అదే జ‌రిగింది. పుష్ప‌2 సినిమా అయితే ఏకంగా 20 నిమిషాల ఎక్స్‌ట్రా కంటెంట్ ను ఓటీటీలో రిలీజ్ చేసింది. ఇప్పుడు డాకు మ‌హారాజ్ 5 నిమిషాల ఎక్స్‌ట్రా కంటెంట్ ను ఓటీటీలో జోడించ‌నుంది.

అయితే డాకు మ‌హారాజ్ సినిమా ఆంధ్ర మ‌రియు ఓవ‌ర్సీస్ లో బాగా క‌లెక్ట్ చేసిన‌ప్ప‌టికీ నైజాం, రాయ‌ల‌సీమ లో మాత్రం అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ముందు మంచి ఓపెనింగ్స్ తో మొద‌లైన డాకు మ‌హారాజ్ క‌లెక్ష‌న్స్ సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా రిలీజ‌య్యాక క్ర‌మంగా త‌గ్గాయి. మ‌రి ఓటీటీలోకి వ‌చ్చాక డాకు ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటాడో చూడాలి.