Begin typing your search above and press return to search.

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్.. బాలయ్య ఊచకోతే!

అయితే బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ అప్డేట్ ను రీసెంట్ గా మేకర్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Dec 2024 6:25 AM GMT
డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్.. బాలయ్య ఊచకోతే!
X

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఆరు పదుల వయసులో కూడా యంగ్ హీరోలతో పోటీ మరీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం డాకు మహారాజ్ మూవీతో బిజీగా ఉన్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. నెవ్వర్ బిఫోర్ అనేలా బాలయ్యను మాస్ లుక్ లో చూపిస్తానని ఆయన పలుమార్లు తెలిపారు.

అందుకు తగ్గట్టుగానే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ ఉన్నాయి. వేరే లెవెల్ లో ఆకట్టుకున్నాయి. సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన డాకు మహరాజ్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ అప్డేట్ ను రీసెంట్ గా మేకర్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రోమోను శుక్రవారం రిలీజ్ చేస్తామని ముందే చెప్పినట్లు విడుదల చేశారు. అదిరిపోయే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో బాలయ్య పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. గొడ్డలి పట్టుకుని ఊచకోత కోసం గుర్రంపై వెళ్తున్నట్లు ఉన్నారు.

డేగ డేగ దోఖో.. అంటూ సాగుతున్న డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచి వ్యూస్ అందుకుని దూసుకుపోతోంది. గూస్ బంప్స్ తెప్పిస్తోందనే చెప్పాలి. విజువల్స్ క్రేజీగా ఉండి ఆకట్టుకుంటున్నాయి. బాలయ్య ఊచకోత తప్పదనేలా అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ప్రోమో అదిరిపోయిందని, సాంగ్ పై అంచనాలు పెరుగుతున్నాయని అంటున్నారు. అయితే ఫస్ట్ సింగిల్ కు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. నకాష్ అజీజ్ పాడారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్... వేరే లెవెల్ లో ఉంది. సాంగ్ ఛార్ట్ బస్టర్ గా నిలిచేలా కనిపిస్తోంది. మొత్తానికి ఫస్ట్ సింగిల్ కోసం వెయిట్ చేస్తున్నట్లు అంతా చెబుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. డాకు మహారాజ్ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మరి డాకు మహారాజ్ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.