Begin typing your search above and press return to search.

డాకు మహారాజ్ బిగ్ సర్ ప్రైజ్.. గేట్ రెడి

దీంతో నేడు సాయంత్రం హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో కొత్త ఈవెంట్ ప్లాన్ చేశారు.

By:  Tupaki Desk   |   10 Jan 2025 8:02 AM GMT
డాకు మహారాజ్ బిగ్ సర్ ప్రైజ్.. గేట్ రెడి
X

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ చిత్రంపై అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. బాలయ్య గత సినిమాలు వరుసగా హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది సంక్రాంతికి NBK వీరాసింహ రెడ్డి సినిమాతో సాలీడ్ సక్సెస్ అందుకున్నారు. ఇక ఇప్పుడు డాకు మహరాజ్ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోబోతున్నట్లు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఇక శ్రద్ధా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించాయి. అయితే బాలయ్య మాస్ ఇమేజ్‌కు పూర్తి న్యాయం చేయలేదనే అభిప్రాయం ట్రైలర్‌పై వ్యక్తమైంది. అందుకే ఇప్పుడు మరో సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.

నేడు గ్రాండ్ గా రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధమైంది. అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకున్న విషయం తెలిసిందే. కానీ బుధవారం రాత్రి తిరుపతిలో జరిగిన విషాదకర ఘటన కారణంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో నేడు సాయంత్రం హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో కొత్త ఈవెంట్ ప్లాన్ చేశారు.

ఈ ఈవెంట్‌లో మరో ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ పూర్తిగా మాస్ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించారని సమాచారం. బాలయ్య అభిమానుల కోసం ప్రత్యేకంగా ఈ ట్రైలర్‌లో మాస్ డైలాగ్‌లు, హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు. డాకు మహారాజ్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది.

సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు బాలయ్య మార్క్ మాస్ మసాలాతో ప్రేక్షకులకు పండుగ వాతావరణాన్ని కలిగిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఈరోజు విడుదల కానున్న ట్రైలర్ గురించి చిత్ర బృందం ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది. ఈ ట్రైలర్ బాలయ్య అభిమానులకు కిక్ ఇచ్చే విధంగా ఉండబోతుందంటున్నారు.

"బాలయ్య సినిమా ట్రైలర్ అంటే ఇదీ, రియల్ రిలీజ్ ట్రైలర్ అంటే ఇదీ" అని మేకర్స్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. సాయంత్రం వరకు ఈ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి డాకు మహారాజ్ విడుదలకు ముందు రాయలసీమలో ప్రత్యేకంగా నిర్వహించాల్సిన ఈవెంట్ రద్దు కావడంతో హైదరాబాద్ ఈవెంట్ ద్వారా ఆ లోటును పూడ్చాలని మేకర్స్ భావిస్తున్నారు. బాలయ్య మాస్ ఇమేజ్‌ను పక్కాగా క్యాష్ చేసుకునే విధంగా ఈ సినిమా వసూళ్లను రాబట్టబోతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.