తమిళ వేటకు సిద్ధమైన డాకు
బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు తమిళనాడు బాక్సాఫీస్‌ను దూసుకుపోవడానికి సిద్ధమైంది.
By: Tupaki Desk | 16 Jan 2025 7:28 AM GMTనందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద బిగ్ భారీ హిట్‌గా నిలుస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. బాలయ్య మాస్ ఎలివేషన్ సీన్లు, థమన్ అందించిన సౌండ్‌ట్రాక్, అలాగే బాబీ టేకింగ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి.
తెలుగులో బాక్సాఫీస్ షేర్ వసూళ్లు ఇప్పటికే 40 కోట్లు దాటాయి. త్వరలోనే గ్రాస్ పరంగా సెంచరీ కొట్టే అవకాశం ఉంది. బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు తమిళనాడు బాక్సాఫీస్‌ను దూసుకుపోవడానికి సిద్ధమైంది. తమిళ వెర్షన్ జనవరి 17న విడుదల కానున్నట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.
తెలుగులో సక్సెస్ అందుకున్న ఈ సినిమా తమిళ ప్రేక్షకుల మనసును కూడా గెలుచుకుంటుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బహుభాషా విడుదల కావడం వల్ల సినిమా రీచ్ మరింత విస్తృతం కానుంది. తమిళనాట బాలయ్యకు మంచి ఫాలోయింగ్ ఉండడం, కథలో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల సినిమా విజయవంతమవుతుందనే అంచనాలు ఉన్నాయి. అలాగే తమిళంలో ప్రస్తుతం పెద్దగా పోటీని ఇచ్చే సినిమాలు లేవు. కేవలం విశాల్ సినిమా ఒకటి మినిమమ్ హైప్ తో కొనసాగుతోంది.
తెలుగులో పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా డాకు మహారాజ్ ఫ్యామిలీ ఆడియన్స్ వరకు చేరింది. తమిళనాడులో కూడా పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలదా అనే దానిపై ట్రేడ్ వర్గాలు దృష్టి సారించాయి. ఇప్పటికే విడుదలైన తమిళ పోస్టర్లు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. థమన్ అందించిన నేపథ్య సంగీతం, విజువల్ గ్రాండియర్ సినిమా ప్రధాన బలంగా నిలుస్తాయని చెప్పవచ్చు.
తమిళనాడులో ఈ సినిమా విజయవంతమవుతే, బాలయ్యకు అక్కడ మరింత ఫాలోయింగ్ పెరుగుతుంది. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ పాత్ర కూడా తమిళనాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. కథలో ఉన్న యాక్షన్, ఎమోషన్ ఎలిమెంట్స్ అటు మాస్ ప్రేక్షకులను, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. తెలుగు సినిమాలు ఇతర భాషల్లో కూడా ప్రభావం చూపించడం లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది.
డాకు మహారాజ్ కూడా తమిళ విడుదలకు సిద్ధమవడంతో, ఇది బాలయ్యకు మరొక బై లాంగ్యువల్ విజయాన్ని అందిస్తుందా లేదా అనేది చూడాలి. తమిళనాడులో విడుదలయ్యాక అక్కడి ఆడియన్స్ నుంచి వచ్చే స్పందన ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద, తెలుగులో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన డాకు మహారాజ్ ఇప్పుడు తమిళ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.