Begin typing your search above and press return to search.

యూఎస్‌లో బాలయ్య ఫ్యాన్స్ అత్యుత్సాహం... 'డాకు' షో నిలిపివేత!

అమెరికాలోని ఒక థియేటర్‌లో బాలకృష్ణ ఫ్యాన్స్‌ చేసిన రచ్చ కారణంగా ఏకంగా షో ను నిలిపి వేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   13 Jan 2025 7:23 AM GMT
యూఎస్‌లో బాలయ్య ఫ్యాన్స్ అత్యుత్సాహం... డాకు షో నిలిపివేత!
X

సంక్రాంతి కానుకగా వచ్చిన 'డాకు మహారాజ్‌' సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. ఈ సంక్రాంతి విజేత మా బాలకృష్ణ అంటూ నందమూరి ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు. నెట్టింట ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు తెగ హడావిడి చేస్తున్నాయి. దాంతో సినిమాకి రెండో రోజు మరింత వసూళ్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా డాకు వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటూ నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు. మొదటి రోజు బాలకృష్ణ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద చేసిన సందడి అంతా ఇంతా కాదు. అమెరికాలోనూ బాలయ్య ఫ్యాన్స్ రచ్చ చేశారు.

అమెరికాలోని ఒక థియేటర్‌లో బాలకృష్ణ ఫ్యాన్స్‌ చేసిన రచ్చ కారణంగా ఏకంగా షో ను నిలిపి వేయడం జరిగింది. బాలకృష్ణ ఫ్యాన్స్‌కి షాక్‌ ఇచ్చిన ఆ థియేటర్‌ యాజమాన్యం తిరిగి ఆట ప్రారంభించేందుకు చాలా కండీషన్స్ పెట్టింది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే... అమెరికా నార్త్‌ కరోలినాలోని రాలీగ్‌లో డాకు మహారాజ్ సినిమా స్క్రీనింగ్‌ జరిగింది. ప్రీమియర్‌ షో సందర్భంగా బాలకృష్ణ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కేకలు పెట్టడంతో థియేటర్‌ యాజమాన్యం మొదట డీటీఎస్ సౌండ్‌ నిలిపి వేసింది. కొంత సమయం సాధారణ సౌండ్ సిస్టంతోనే సినిమాను నడిపించారు.

ఆ సమయంలోనూ బాలకృష్ణ ఫ్యాన్స్ రచ్చ ఆగలేదు. కేకలతో హాల్ దద్దరిల్లే విధంగా చేయడంతో మొత్తానికి ఆట నిలిపి వేశారు. డాకు మహారాజ్ సినిమా మధ్యలోనే నిలిచి పోవడంతో పాటు థియేటర్‌ నుంచి అంతా బయటకు వెళ్లి పోవాలంటూ థియేటర్ నిర్వాహకులు సూచించారు. దాంతో కొందరు వెళ్లి మేనేజ్మెంట్‌ను ఒప్పించి కండీషన్స్‌తో సినిమాను వేయించారు. అలా బాలకృష్ణ అభిమానుల రచ్చ అమెరికాలో డాకు మహారాజ్‌ సినిమా మధ్యలో నిలిచి పోయే విధంగా చేసింది. బాలకృష్ణ అభిమానులు అంటే మినిమం ఉంటుంది, ఆ మాత్రం హడావుడి చేస్తారు అంటూ మరోసారి ఈ ఘటనతో నిరూపితం అయ్యింది అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

బాలకృష్ణ ఈ సినిమాలో మొదటి సారి డాకుగా కనిపించడం ద్వారా అంచనాలు మరింతగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంది. ఆకట్టుకునే కథ లేకున్నా బాలకృష్ణ యాక్షన్‌ సన్నివేశాలు, ఆయన ఎలివేషన్‌ సీన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కారణంగా సినిమా బాగుంది అంటూ రెగ్యులర్‌ సినీ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొదటి రోజు ఈ సినిమా డీసెంట్‌ ఓపెనింగ్‌ను నమోదు చేయడంతో పాటు రెండో రోజు అంతకు మించి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. సంక్రాంతి సెలవులు కలిసి వచ్చి ఈ సినిమా లాంగ్‌ రన్‌లో భారీ వసూళ్లు సొంతం చేసుకుంటుందేమో చూడాలి.