Begin typing your search above and press return to search.

డాకు మహారాజ్‌ యూఎస్‌ టార్గెట్.. ఇంకా ఎంత రావాలి?

డాకు మహారాజ్ సినిమా కేవలం $400K దూరంలోనే ఉండటంతో, ఇది బయ్యర్లకు మంచి నమ్మకాన్ని కలిగిస్తోంది.

By:  Tupaki Desk   |   15 Jan 2025 8:26 AM GMT
డాకు మహారాజ్‌ యూఎస్‌ టార్గెట్.. ఇంకా ఎంత రావాలి?
X

సంక్రాంతి కానుకగా విడుదలైన నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఓ వైపు గేమ్ ఛేంజర్ అత్యధిక థియేటర్స్ లో విడుదలైనప్పటికి డాకు మహరాజ్ తన థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ తో మంచి సౌండ్ క్రియేట్ చేస్తోంది. అలాగే బెస్ట్ ఫెస్టివల్ మాస్ సినిమా అనే ట్యాగ్ కూడా గట్టిగానే వైరల్ అవుతోంది. ఇక ఈ ప్రభావం ఓవర్సీస్ మార్కెట్ లో కూడా కనిపిస్తోంది.

మొత్తానికి యూఎస్‌లో కూడా బాలయ్యకు కెరీర్‌లోనే అత్యుత్తమ ఓపెనింగ్‌ను ఈ సినిమా అందించింది. ప్రీమియర్ షోతోపాటు ఫస్ట్ డే కలెక్షన్లతో ఈ సినిమా యూఎస్ మార్కెట్‌లో దుమ్ము లేపింది. ప్రస్తుతానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ $1.5 మిలియన్ కాగా, ఇప్పటి వరకు $1.1 మిలియన్ దాకా వసూళ్లు చేసింది. అనుకున్న టార్గెట్ ఫినిష్ కావాలి అంటే ఇంకా $400K రాబట్టాల్సి ఉంది.

ఇప్పటికే మంచి స్టార్ట్ దక్కించుకున్న డాకు మహారాజ్ యూఎస్‌లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనేది అసలు సందేహం. ఇక లేటెస్ట్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా $73,213 వసూలు చేసింది. రోజు మొత్తానికి $100K చుట్టూ నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే, రోజుకు $100K స్థిరంగా వసూలు చేస్తే టార్గెట్ చేరుకోవడం సులభమే అనిపిస్తోంది.

ముఖ్యంగా శుక్రవారం, శనివారం వసూళ్లు కీలకం కానున్నాయి. వీకెండ్‌లో ఆడియన్స్ థియేటర్లకు తిరిగి వస్తే, సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి బూస్ట్ లభించవచ్చు. యూఎస్ మార్కెట్‌లో బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే మౌత్ టాక్ కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్యామిలీ, మాస్ ప్రేక్షకుల ఆదరణ కొనసాగితే టార్గెట్ చేరుకోవడం చాలా ఈజీ. ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఇతర సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ, బాలయ్య మాస్ ఫ్యాన్స్ కలిసికట్టుగా సినిమాను విజయవంతం చేస్తున్నారు.

అలాగే యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్లతో డాకు మహారాజ్ కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. మిగిలిన రోజుల్లో ఇలాగే కలెక్షన్లు స్టడీగా కొనసాగితే టార్గెట్ అందడం ఖాయం. డాకు మహారాజ్ సినిమా కేవలం $400K దూరంలోనే ఉండటంతో, ఇది బయ్యర్లకు మంచి నమ్మకాన్ని కలిగిస్తోంది. ట్రేడ్ విశ్లేషకులు ఈ సినిమా టార్గెట్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్ తర్వాత అసలు పరిస్థితి పూర్తిగా స్పష్టమవుతుంది.

ప్రస్తుత వసూళ్లు:

బ్రేక్ ఈవెన్ టార్గెట్: $1.5 మిలియన్

ఇప్పటివరకు వసూలైన మొత్తం: $1.1 మిలియన్

ఇంకా రావాల్సిన మొత్తం: $400K