ఫ్యాన్ కాదు ఫాలోవర్.. టచ్ చేశావ్ బాబీ..!
బాలకృష్ణ గారిని మొదట కలిసినప్పుడు తాను చిరంజీవి అభిమానిని ఆయన స్పూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చా అని చెప్పగానే ఎంతో ఆప్యాయంగా ఎంకరేజ్ చేశారు.
By: Tupaki Desk | 23 Jan 2025 12:51 PM GMTనందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మించగా కె.ఎస్ బాబీ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్స్ గా నటించిన డాకు మహారాజ్ లో ఊర్వశి రౌతెలా స్పెషల్ రోల్ లో సర్ ప్రైజ్ చేశారు. పొంగల్ కి మాస్ ఫీస్ట్ అందించిన ఈ సినిమా సక్సెస్ అయినందుకు అనంతపూర్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు.
ఈ సెలబ్రేషన్స్ లో డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ స్పీచ్ నందమూరి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. బాలకృష్ణ గారిని మొదట కలిసినప్పుడు తాను చిరంజీవి అభిమానిని ఆయన స్పూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చా అని చెప్పగానే ఎంతో ఆప్యాయంగా ఎంకరేజ్ చేశారు. బాలయ్య దగ్గర అబద్ధాలకు స్పేస్ లేదు.. ఫిల్టర్స్ లేకుండా ఉంటారని అన్నాడు బాబీ. బాలయ్య బాబుతో సినిమా చేసే టైం లో ఆయన మన్సు ఏంటన్నది అర్ధమైంది. నాన్న కాలం చేయక ముందే బాలయ్యతో ఒక సినిమా చేసి ఉంటే నాన్న ఇంకాస్త బాగా అర్ధమయ్యే వాడని అన్నారు బాబీ.
సినిమాకు బాలయ్య ఇచ్చిన సపోర్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పిన బాబీ ప్రతి విషయంలో చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారని అన్నారు. సినిమాకు మ్యూజిక్ అందించిన థమన్ అవుట్ పుట్ కోసం గొడవపడ్డామని అన్నారు. నందమూరి థమన్ అంటూ బాలకృష్ణ గారే నీకు పేరు మార్చారు.. తాను కూడా మరో రెండు మూడు సినిమాలకు దాని కోసం ట్రై చేస్తానని సరదాగా అన్నారు బాబీ.
ఇక సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ కూడా సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారని అన్నారు బాబీ. హీరోయిన్స్ శ్రద్ధా, ప్రగ్యా సినిమాకు ప్లస్ అయ్యారు. ఊర్వశి దబిడి దిబిడే ఇక్కడే కాదు ఫారిన్ లో కూడా ఊపేస్తుందని అన్నారు. బాలకృష్ణ గారితో మళ్లీ మళ్లీ సినిమా చేయాలని డాకు మహారాజ్ కన్నా మించి సినిమా చేస్తానని అన్నారు బాబీ. బాలయ్యని ఈ సినిమా ప్రయాణంలో చూసి అందరు ఫ్యాన్ అవుతా అంటారు కానీ తాను ఫాలోవర్ అయిపోయా అని అన్నారు బాబీ.