Begin typing your search above and press return to search.

వీడియో : బర్త్‌డే పార్టీలో దబిడి దిబిడి

తాజాగా ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన దబిడి దిబిడి సాంగ్‌ మరోసారి వైరల్‌ అవుతోంది. ఊర్వశి తన పుట్టిన రోజు సందర్భంగా పబ్‌లో పార్టీకి హాజరు అయింది.

By:  Tupaki Desk   |   25 Feb 2025 9:31 AM GMT
వీడియో : బర్త్‌డే పార్టీలో దబిడి దిబిడి
X

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొంది గత నెల సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ సినిమా వచ్చింది. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటించగా ఊర్వశి రౌతేలా, శ్రద్దా శ్రీనాథ్‌లు ముఖ్య పాత్రల్లో నటించారు. ఊర్వశి రౌతేలా, బాలకృష్ణ కాంబోలో దబిడి దిబిడి అంటూ పాట ఉంది. తమన్‌ సంగీతాన్ని అందించిన ఆ పాటకు శేఖర్ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. మ్యూజికల్‌గా విభిన్నంగా ఉండటంతో పాటు శేఖర్ మాస్టర్ బాలయ్య, ఊర్వశితో వేయించిన స్టెప్స్‌ వివాదాస్పదం అయ్యాయి. ఇదేం డాన్స్ అంటూ హిందీ సినీ రివ్యూవర్స్‌ విమర్శకులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడే అదే పాట దేశం మొత్తం మాత్రమే కాకుండా ఇతర దేశాల్లోనూ తెగ ట్రెండ్‌ అవుతోంది.

డాకు మహారాజ్ సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌లో రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మొదటి వారం రోజులు నాన్‌ ఇంగ్లీష్ కేటగిరీలో నెం.1 స్థానంలో నిలిచిన డాకు మహారాజ్ ప్రస్తుతం ఇండియా కాకుండా మరో పది దేశాల్లోనూ టాప్‌ 10 జాబితాలో నిలిచింది. రెండో వారంలోనూ అత్యధిక వ్యూస్ దక్కించుకుంటూ ట్రెండ్‌ అవుతున్న డాకు మహారాజ్ సినిమాలోని దబిడి దిబిడి సాంగ్ ఓ రేంజ్‌లో ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. ఓటీటీ స్ట్రీమింగ్‌ తర్వాత ఈ పాటకు మరింతగా పాపులారిటీ పెరిగింది. పాటను చూసి సినిమా చూస్తున్నారు, సినిమాను చూసి పాటను చూస్తున్నారు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన దబిడి దిబిడి సాంగ్‌ మరోసారి వైరల్‌ అవుతోంది. ఊర్వశి తన పుట్టిన రోజు సందర్భంగా పబ్‌లో పార్టీకి హాజరు అయింది. ఆ సమయంలో డీజేతో కలిసి దబిడి దిబిడి సాంగ్‌కి స్టెప్స్ వేసింది. కలర్‌ ఫుల్‌ లైట్స్‌లో తన డిజైనర్‌ డ్రెస్‌లో ఊర్వశి కన్నుల విందు చేసింది. ఊర్వశి రౌతేలా దబిడి దిబిడి సాంగ్‌తో చాలా ట్రోల్స్‌ను ఎదుర్కొంది. అదే పాట ఆమెకు జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చి పెట్టింది. అందుకే ప్రతి కార్యక్రమంలోనూ, పార్టీలోనూ ఊర్వశి రౌతేలా ఆ పాటతో తెగ సందడి చేస్తుంది. గతంలో విమర్శించిన వారు సైతం ఈ పాటను ఎంజాయ్‌ చేస్తున్నామంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో 72 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్న ఊర్వశి రౌతేలా దబిడి దిబిడి సాంగ్ వీడియో షేర్‌ చేసిన వెంటనే లక్షకు పైగా లైక్స్‌ వచ్చాయి. అంతే కాకుండా పాటను షేర్‌ చేసిన, వారు సేవ్‌ చేసిన వారు కామెంట్‌ చేసి తమ అభిప్రాయం చెప్పిన వారు సైతం లక్షల్లో ఉన్నారు. మొత్తానికి దబిడి దిబిడి సాంగ్‌ మరోసారి ఊర్వశి రౌతేలా బర్త్‌డే బష్ కారణంగా వైరల్‌ అవుతుంది. ఆ మధ్య విదేశీ అమ్మాయిలు, హాస్టల్‌లో అమ్మాయిలు విభిన్నమైన డాన్స్‌ మూమెంట్స్‌తో దబిడి దిబిడి స్టెప్స్‌ వేయడంతో పాట వైరల్‌ అయిన విషయం తెల్సిందే. బాలకృష్ణ - తమన్‌ కాంబోలో నాల్గవ సినిమాగా వచ్చిన డాకు మహారాజ్ మ్యూజికల్‌గా బ్లాక్‌ బస్టర్‌ అని ఈ పాటకి వచ్చిన స్పందన చూస్తే అర్థం అవుతుంది.