Begin typing your search above and press return to search.

డెకాయిట్ హీరోయిన్ తనేనా?

ఆమె మృణాల్ ఠాకూర్ అని చాలా మంది చెబుతున్నారు. శృతి హాసన్ స్థానాన్ని మృణాల్ ఠాకూర్ తో భర్తీ చేసినట్లు మాట్లాడుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   16 Dec 2024 1:16 PM GMT
డెకాయిట్ హీరోయిన్ తనేనా?
X

అడవి శేష్, శృతిహాసన్ జోడిగా స్టార్ట్ అయిన 'డెకాయిట్' మూవీ గ్లింప్స్ గతంలో రిలీజ్ అయ్యింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయినా ఎందుకనో మరల హోల్డ్ అయ్యింది. షానీల్‌ డియో దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

అడివి శేష్ ఓ వైపు 'గూఢచారి 2' సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అందుకే 'డెకాయిట్' మూవీ హోల్డ్ లో పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో శృతి హాసన్ మూవీ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఆమె మీద తెరకెక్కించిన సన్నివేశాలని కూడా పూర్తిగా తొలగించారు. శృతి హాసన్ స్థానంలో కొత్త హీరోయిన్ ని తీసుకున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో అడివి శేష్ బ్యాక్ లో హీరోయిన్ ఫేస్ హైడ్ చేశారు. కేవలం కళ్ళు మాత్రమే రివీల్ చేశారు. మంగళవారం ఉదయం 11:30 గంటలకి హీరోయిన్ క్యారెక్టర్ ని రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ హీరోయిన్ లుక్ ని రివీల్ చేయకుండా పోస్టర్ ని రివీల్ చేసి మేకర్స్ సస్పెన్స్ మెయింటేన్ చేసే ప్రయత్నం చేస్తున్న కూడా నెటిజన్లు మాత్రం ఆమె ఎవరనేది ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నారు.

ఆమె మృణాల్ ఠాకూర్ అని చాలా మంది చెబుతున్నారు. శృతి హాసన్ స్థానాన్ని మృణాల్ ఠాకూర్ తో భర్తీ చేసినట్లు మాట్లాడుకుంటున్నారు. మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. 'డెకాయిట్' లో ఆమె హీరోయిన్ అయితే మాత్రం కచ్చితంగా సినిమాకి మరింత హైప్ వస్తుందనే మాట వినిపిస్తోంది. 'సీతారామం', 'హాయ్ నాన్న' సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని మృణాల్ అందుకున్నారు.

'ది ఫ్యామిలీ స్టార్' మూవీ ఫ్లాప్ అయిన కూడా తెలుగు నాట ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో అడివి శేష్ కి జోడీగా 'డెకాయిట్' చిత్రంలో మృణాల్ ని ఫైనల్ చేసి ఉంటారని అనుకుంటున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యిందని పోస్టర్ బట్టి అర్ధమవుతోంది. అంటే వచ్చే ఏడాది అడివి శేష్ నుంచి 'గూఢచారి 2'తో పాటు 'డెకాయిట్' సినిమాలు రెండు ప్రేక్షకుల ముందుకి రావడం ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లేనని టాక్ వినిపిస్తోంది.