Begin typing your search above and press return to search.

డెకాయిట్ జంట బావుంది కొంటెగా

డెకాయిట్ చిత్రం యాక్షన్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. ఇది ఇద్దరు మాజీ దొంగ‌లు, ప్రేమికుల చుట్టూ తిరిగే క‌థాంశం

By:  Tupaki Desk   |   13 Jun 2024 4:06 AM GMT
డెకాయిట్ జంట బావుంది కొంటెగా
X

టాలీవుడ్ లో అగ్ర క‌థానాయ‌కుల స‌ర‌స‌న న‌టించింది శ్రుతిహాస‌న్. చిరంజీవి, బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ల్యాణ్, ర‌వితేజ లాంటి సీనియ‌ర్ల స‌ర‌స‌నా న‌టించిన ఈ బ్యూటీ చ‌ర‌ణ్-ఎన్టీఆర్- బ‌న్ని- మ‌హేష్‌ లాంటి పాన్ ఇండియా స్టార్ల స‌ర‌స‌నా న‌టించింది. ఇప్పుడు యువ‌హీరో అడివి శేష్ స‌ర‌స‌నా న‌టిస్తోంది. డెకాయిట్ అనేది సినిమా టైటిల్. శ్రుతి హాసన్- అడివి శేష్ తెరపై కొత్త జంట కావ‌డంతో అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. శేష్ ఇటీవ‌ల `మేజ‌ర్` ఘ‌న‌విజ‌యంతో పాన్ ఇండియా హీరోగా అవ‌త‌రించడంతో ఇది శ్రుతిహాస‌న్ కి ప్ల‌స్ రానుంది.

డెకాయిట్ చిత్రం యాక్షన్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. ఇది ఇద్దరు మాజీ దొంగ‌లు, ప్రేమికుల చుట్టూ తిరిగే క‌థాంశం. సాహసోపేతమైన దోపిడీల కోసం బలవంతంగా తిరిగి ఆ ఇద్ద‌రినీ కలపవలసి వస్తుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌ది తెర‌పైనే చూడాలి. శేష్‌, శ్రుతి ఈ చిత్రంలో తుపాకుల‌తో విరుచుకుప‌డే గ‌జ‌దొంగ‌లుగా క‌నిపించ‌నున్నారు. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న‌ ఈ చిత్రానికి డియో - శేష్ జోడీ కథ - స్క్రీన్ ప్లేను రూపొందించారు.

ఇంతకుముందు శేష్ స్వయంగా త‌న ద‌ర్శ‌కుడు డియో విజన్ గురించి గొప్పగా మాట్లాడాడు. ఈ సినిమా గ్రాండియారిటీ లేకుండా గ్రాండ్‌గా ..ఉప్పెన లేకుండా సొగసుగా ఉంటుంద‌ని వర్ణించాడు. షనిల్ డియో అద్భుత‌మైన విజ‌న్ ఉన్న ద‌ర్శ‌కుడు. సొంపైన‌ దృష్టి, స్క్రిప్ట్‌లోని చాలా మోటైన స్వభావంతో అత‌డు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడ‌ని తెలిపారు. నిశ్శబ్ద భారతదేశంలోని సుదూరంగా ఉన్న‌ ప్రాంతాలు.. అక్క‌డ‌ గ్రామాలు.. పట్టణాలలో తిరిగే పాత్ర‌ల‌తో సినిమా చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంద‌``ని శేష్ చెప్పారు.

డెకాయిట్‌ను సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రం పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. హిందీ- తెలుగులో ఏకకాలంలో తెర‌కెక్కించి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా శ్రుతి ఒక కొత్త ఫోటోని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. శ్రుతితో శేష్ జంట బావుందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.