ఇంకెన్నాళ్లు రానా ఇలా ఇంటర్వ్యూలు!
నటుడిగా రానాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వైవిథ్యమైన కథలు..పాత్రలు ఎంచుకోవడంలో అతడికి అతడే సాటి. రోటీన్ సినిమాలకు రానా ఎప్పుడు దూరమే.
By: Tupaki Desk | 21 Dec 2024 3:00 AM GMTసోషల్ మీడియాలో రానా ఎలా హల్చల్ చేస్తున్నాడో చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ చూసిన రానా ఇంటర్వ్యలే వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీల ఇంటర్వ్యూల్లో రానా బిజీ బిజీగా కనిపిస్తున్నాడు. కొత్త సినిమా ఏది రిలీజ్ అయినా ఆ టీమ్ ని ఇంటర్వ్యూ చేయడం రానా పనిగా పెట్టుకున్నాడు. స్టార్ హీరోల నుంచి చిన్న సినిమాల వరకూ ఎవర్నీ వదలడం లేదు. తన వంతు ప్రయత్నంగా తమ సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
కానీ రానాని ఇంటర్వ్యూ చేసే సన్నివేశం మాత్రం ఇంకా రాలేదు. చివరిగా రానా 'విరాట పర్వం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా రిలీజ్ అయి రెండున్నరేళ్లు దాటింది. ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. హిరణ్య కశిప చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించినా ఆ సినిమాకి బ్రేక్ పడింది. ఇటీవలే రజనీకాంత్ నటించిన 'వెట్టేయాన్' లో ఓకీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు నిఖిల్ నటించిన స్పై లో గెస్ట్ రోల్ పోషించాడు. వెండి తెరపై ఆ మెరుపు తప్ప సోలోగా కనిపించలేదు.
దీంతో కొత్త ఏడాదిలోనైనా గుడ్ న్యూస్ చెబుతాడా? అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంత వరకూ రానా కొత్త కథలు వింటున్నట్లు గానీ, డైరెక్టర్లు అతడిని అప్రోచ్ అయినట్లు గానీ ఎలాంటి వార్త బయటకు రాలేదు. ఇదే కొనసాగితే గ్యాప్ అన్నది రానా మార్కెట్ పై కూడా ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. మరి ఈ విషయంలో రానా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు? అన్నది తెలియాలి.
నటుడిగా రానాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వైవిథ్యమైన కథలు..పాత్రలు ఎంచుకోవడంలో అతడికి అతడే సాటి. రోటీన్ సినిమాలకు రానా ఎప్పుడు దూరమే. 'ఘాజీ' లాంటి దేశం మెచ్చే సినిమా ప్రేక్షకుల ముందుకు రాగలిగింది. రానా చివరి సినిమా 'విరాటపర్వం' కూడా ఓ సెక్షన్ ఆడియన్స్ కి రీచ్ అయింది. కమర్శియల్ గా వర్కౌట్ కానప్పటికీ మంచి సినిమా చేసాడనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.