Begin typing your search above and press return to search.

హ్యాపీ బర్త్‌డే మేరా భాయ్‌

విక్టరీ వెంకటేష్ మరియు సల్మాన్‌ ఖాన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి

By:  Tupaki Desk   |   27 Dec 2023 6:55 AM GMT
హ్యాపీ బర్త్‌డే మేరా భాయ్‌
X

స్టార్‌ హీరోలు ఇతర హీరోల పుట్టిన రోజు లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్‌ చేయడం లేదా మరో రకంగా స్పందించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ స్టార్‌ వెంకటేష్ ట్విట్టర్ ద్వారా బాలీవుడ్ సూపర్ స్టార్‌ సల్మాన్‌ ఖాన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.


విక్టరీ వెంకటేష్ మరియు సల్మాన్‌ ఖాన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధం తోనే గంతంలో సల్మాన్ సినిమా లో వెంకటేష్ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య మరింత స్నేహం పెరిగింది అనడంలో సందేహం లేదు.

నేడు సల్మాన్‌ ఖాన్‌ పుట్టిన రోజు. ఈ నేపథ్యం లో వెంకటేష్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... హ్యాపీ బర్త్‌ డే మేరా భాయ్‌, మేరి జాన్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. అంతే కాకుండా సల్మాన్‌ ఖాన్‌ ను ఆలింగనం చేసుకున్న ఫోటోను కూడా షేర్‌ చేసి తన ఫ్యాన్స్ తో పాటు సల్లూ భాయ్ ఫ్యాన్స్ కి కన్నుల విందు చేశాడు.

ఇక వెంకటేష్ సైంధవ్ సినిమా విషయానికి వస్తే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన సైంధవ్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. వెంకటేష్ కి ఈ సినిమా 75వ సినిమా అవ్వడం వల్ల మరింత పబ్లిసిటీ చేస్తున్నారు.