చిలకాకు పచ్చ కోకలో దక్షా దుమారం!
ఇలా మూడు విజయాలు దక్షాకి టాలీవుడ్ లో మంచి ఐడెంటీని తీసుకొచ్చాయి.
By: Tupaki Desk | 4 Dec 2023 1:06 PM'హోరా హోరి' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ దక్షా నగార్కర్ టాలీవుడ్ కి సుపరిచితురాలే. తొలి సినిమా తో యావరేజ్ సక్సెస్ అందుకుని నటిగా పాస్ మార్కులు వేయించుకుంది. అటుపై `హుషారు` సక్సెస్ తో యూత్ లో ఫేమస్ అయింది. అమ్మడి పెర్పార్మెన్స్ కి యువత ఫిదా అయింది. ఆ వెంటనే `జాంబీ రెడ్డి`తో మరో సక్సెస్ ని అమ్మడు ఖతాలో వేసుకుంది. ఇలా మూడు విజయాలు దక్షాకి టాలీవుడ్ లో మంచి ఐడెంటీని తీసుకొచ్చాయి.
దీంతో పాటు మాస్ రాజా రవితేజ్ `రావణాసూర`లో నూ..అంతకు ముందు బంగార్రాజు చిత్రాల్లోనూ అవకాశం అందుకుంది. కానీ ఈ రెండు సినిమాలు అమ్మడికి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. కానీ ఐడెంటిటీ మాత్రం ఎక్కడా చెక్కు చెదరలేదు. అప్పటివరకూ ఓ సెక్షన్ ఆడియన్స్ కే పరిమితమైన దక్షా నాటి నుంచి మాస్ ఆడియన్స్ లోనూ క్రేజీ బ్యూటీగా మారింది. ఇక అమ్మడి ఇన్ స్టా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో యువతలో హాట్ టాపిక్ గా మారుతుంటుంది. డిజైనర్ దుస్తుల్లో తనదైన మార్క్ అప్పిరియన్స్ తో అలరిస్తుంటుంది.
తాజాగా అమ్మడు చీరందంలో తళుకులినింది. ఇదిగో ఇక్కడిలా చిలకాకు పచ్చ చీరలో..మ్యాచింగ్ రవిక ధరించి బ్యూటీలో అందాలన్ని ఆవిష్కరించింది. నేలపై అమ్మడు వయ్యారంగా కూర్చుని ఇచ్చిన భంగిమకి యువత ఫిదా అవుతుంది. ఈ ఫోటోని ఉద్దేశించి కుర్రాళ్లందరికీ ఓ హాట్ కామెంట్ కూడా విసిరిందండోయ్.` నేను గ్రీన్ లైట్`. మీరంతా షేకైపోవాలి అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో కామెంట్ బాక్స్ లో యువత కామెంట్లకు కొదవలేదు.
అమ్మడు పుట్టి పెరిగింది ముంబైలోనే. బిజినెస్ అడ్మినిస్ర్మేషన్ చదువుతూనే మోడలింగ్ వైపు వచ్చింది. ఓ వైపు చదువు..మరోవైపు మోడలింగ్ రెండింటిలోనూ చురుకుతనం చూపించింది. సినిమాల్లోకి రాకముందు కొన్ని రకాల ప్రకటనల్లోనూ నటించింది. అక్కడ నుంచి నేరుగా టాలీవుడ్ లోనే లాంచ్ అయింది. అంతకు ముందే సోషల్ మీడియాలో ఫేమస్ అయింది.