వామ్మో దక్షా.. ఏంటా అందాలు..!
ఇక, కళ్లకు గాగుల్స్ పెట్టి, హెయిర్ లీవ్ చేసి, స్టైలిష్ గా ఫోజులు ఇచ్చింది. ఓ కాఫీ షాప్ లో ఈ ఫోటోలు దిగినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 12 Sep 2023 10:39 AM GMTటాలీవుడ్ యంగ్ హీరోయిన్ దక్ష నగార్కర్ కి పరిచయం అవసరం లేదు. చేసింది చాలా తక్కువ సినిమాలు అయినా, గుర్తింపు మాత్రం చాలా తొందరగానే సంపాదించుకుంది. అయితే, గుర్తింపు వచ్చినా, స్టార్ హీరోయిన్ కాదు కదా, మీడియం రేంజ్ హీరోయిన్ కూడా కాలేకపోయింది. అయితే, ఆమె అందానికి మాత్రం వంక పెట్టే పని లేదు. చూడగానే ఎవరినైనా ఆకర్షించేలా ఉంటుంది. ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా, సులభంగా చేయగల సత్తా కూడా ఉంది.
అయితే, సినిమాల్లో అవకాశాలు రాకున్నా, సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేయగా, అవి వైరల్ గా మారాయి. సూపర్ మోడల్ లాగా ముస్తాబై కనిపించింది. చాలా స్టైలిష్ గా ఉంది. ఆ డ్రెస్ కూడా స్పెషల్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ డ్రెస్ లో నుంచి తన ఎద అందాలు క్లియర్ గా కనిపించేలా డిజైన్ చేయడం విశేషం. మరోవైపు థైస్ షో కూడా చేసింది.
ఇక, కళ్లకు గాగుల్స్ పెట్టి, హెయిర్ లీవ్ చేసి, స్టైలిష్ గా ఫోజులు ఇచ్చింది. ఓ కాఫీ షాప్ లో ఈ ఫోటోలు దిగినట్లు తెలుస్తోంది. ఆమె ఫోటోలు షేర్ చేసిన గంటల్లోనే అవి వైరల్ గా మారాయి. ఇక, కామెంట్ల గురించి అయితే, స్పెషల్ గా చెప్పర్లేదు. ఆమె అందాలను విపరీతంగా పొగిడేస్తున్నారు.
ఇక, దక్ష తొలిసారి హోరాహోరీ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ, ఆ సినిమా గురించి కూడా ఎవరికీ తెలియకపోవడంతో దక్షకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, ఆ తర్వాత హుషారు అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ క్లిక్ అయినా, దక్షకు పెద్దగా ఛాన్సులు రాలేదనే చెప్పాలి.
జాంబిరెడ్డి, బంగార్రాజు వంటి చిత్రాలు హిట్ అయినా, దక్ష కెరీర్ కి ఉపయోగపడేలేదు. రవితేజ రావణాసురలో అవకాశం వచ్చింది కానీ, ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఆమెకు మళ్లీ ఆఫర్లు రాలేదు. కొత్తగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. మరి, ఫ్యూచర్ లో ఆమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.