Begin typing your search above and press return to search.

డాకు మహారాజ్‌ : అమెరికా తర్వాత అమరావతి

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్‌ అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   18 Dec 2024 9:56 AM GMT
డాకు మహారాజ్‌ : అమెరికా తర్వాత అమరావతి
X

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్‌ అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. బాలయ్య కెరీర్‌లో ఈమధ్య కాలంలో ఇంతటి విజయాలు దక్కడం ఇదే కావడం విశేషం. తక్కువ సమయంలోనే ఎక్కువ విజయాలను సొంతం చేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 'డాకు మహారాజ్‌' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఇటీవలే బాలకృష్ణ డబ్బింగ్‌ పూర్తి చేశారు. త్వరలోనే సినిమా నుంచి రెండో పాట విడుదల కాబోతుంది అంటూ యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా కోసం యూఎస్‌ఏలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. బాలకృష్ణతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు, ప్రముఖులు అమెరికాలో జరగబోతున్న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనబోతున్నారు. యూఎస్‌లో భారీ ఎత్తున వసూళ్లు సొంతం చేసుకోవడం కోసం డాకు మహారాజ్‌ను అక్కడ ప్రమోట్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చరణ్ గేమ్‌ ఛేంజర్‌ సినిమా సైతం సంక్రాంతికి రాబోతుంది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికా డల్లాస్‌ లో చేయబోతున్నారు. అందుకు తగ్గకుండా డాకు మహారాజ్ సినిమా ఈవెంట్‌ను యూఎస్‌లో ఒక పండుగ మాదిరిగా నిర్వహించబోతున్నారు.

యూఎస్‌లో సినిమా ఈవెంట్‌తో కచ్చితంగా భారీ అంచనాలు క్రియేట్‌ కావడం ఖాయం. ఆ తర్వాత తక్కువ గ్యాప్‌లోనే అమరావతిలో భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో డాకు మహారాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా అయిన బాలకృష్ణ తన బలంను చూపించడం కోసం అమరావతిలో డాకు మహారాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ విషయం పక్కన పెడితే టీడీపీ ప్రభుత్వం ఉండటంతో అమరావతిలో జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కచ్చితంగా చాలా స్పెషల్‌ గెస్ట్‌లతో నిండి పోయే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

డాకు మహారాజ్ సినిమా విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందినట్లుగా తెలుస్తోంది. ఇటీవల వచ్చిన టీజర్ సినిమా స్థాయిని అమాంతం పెంచింది. అంతే కాకుండా తాజాగా వచ్చిన పాట సైతం సినిమా పై అంచనాలు మరింతగా పెంచే విధంగా ఉంది. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటించగా కీకల పాత్రలో శ్రద్ద శ్రీనాథ్ కనిపించబోతుంది. ఈ సినిమాకు తమన్‌ అందించిన పాటలు అన్నీ బాగుంటాయని అంటున్నారు. ఇక బాలకృష్ణ, తమన్‌ కాంబో మూవీ అనగానే ఎక్కువ శాతం మంది బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కనుక ఈ సినిమాకు కచ్చితంగా తమన్ తన బెస్ట్‌ బీజీఎం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి విజేతగా డాకు మహారాజ్ నిలవడం ఖాయం అంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు.