Begin typing your search above and press return to search.

డాకు మహరాజ్.. ఇక నాన్ స్టాప్ సౌండ్

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ సంక్రాంతి రేసులో థియేటర్స్ లోకి వస్తోంది.

By:  Tupaki Desk   |   31 Dec 2024 7:30 AM GMT
డాకు మహరాజ్.. ఇక నాన్ స్టాప్ సౌండ్
X

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ సంక్రాంతి రేసులో థియేటర్స్ లోకి వస్తోంది. హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ మూవీ కథ ఉండబోతోంది. ఇప్పటికే మూవీ టీజర్ ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. ఇదలా ఉంటే బాలకృష్ణ ‘అఖండ’ నుంచి వరుస సక్సెస్ లతో జోరు మీద ఉన్నాడు.

స్టోరీ సెలక్షన్ కూడా కొత్తగా ఉంటుంది. అందుకే ‘డాకు మహారాజ్’ కూడా కచ్చితంగా అందరికి చేరువ అవుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో ఆ విధంగా కూడా సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది.

థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ ని మేకర్స్ షురూ చేస్తున్నారు. దానికి సంబందించిన షెడ్యూల్ కూడా ఖరారు అయిపొయింది. జనవరి 2న మూవీ ఈవెంట్ జెఆర్సీ కన్వెన్షన్ లో ఉండబోతోందని తెలుస్తోంది. తరువాత 3, 4 తేదీలలో యూఎస్ లోని డల్లాస్ లో ‘డాకు మహారాజ్’ మెగా ఈవెంట్స్ ఉంటాయంట.

జనవరి 7న డాకు మహారాజ్ టీమ్ ఇంటర్వూస్ ఉండబోతున్నాయి. జనవరి 8న ఏపీలో మెగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. వీటితో పాటు మూవీ రిలీజ్ వరకు టీమ్ క్రూ ఇంటర్వ్యూలు వరుసగా ఉంటాయని తెలుస్తోంది. ఇలా గ్యాప్ లేకుండా ‘డాకు మహారాజ్’ ప్రమోషన్ యాక్టివిటీస్ ని మేకర్స్ ప్లాన్ చేశారు. జనవరి 2న మూవీ ట్రైలర్ రిలీజ్ ఉండొచ్చని అనుకుంటున్నారు.

డాకు మహారాజ్ మూవీ జనవరి 12న థియేటర్స్ లోకి రాబోతోంది. 2023 సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’ సినిమాతో బాలయ్య ప్రేక్షకుల ముందుకొచ్చి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు డాకు మహారాజ్ తో మరో సూపర్ సక్సెస్ ని బాలయ్య సొంతం చేసుకుంటాడని అనుకుంటున్నారు.

సంక్రాంతి రేసులో ఈ సినిమాకి పోటీగా రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’, విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఈ మూడింటి మీద పబ్లిక్ లో ఎంతోకొంత హైప్ ఉంది. ఈ నేపథ్యంలో వీటిలో ఏది ఆడియన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.