Begin typing your search above and press return to search.

ఫిబ్ర‌వ‌రిలో ద‌ళ‌ప‌తి విజ‌య్ రాజ‌కీయ పార్టీ లాంచ్?

విజయ్ తన సినీ కెరీర్‌కు విరామం ఇచ్చి రాజ‌కీయాల్లోకి వెళుతున్నాడ‌నే వార్తలు ముఖ్యాంశాలుగా మారాయి.

By:  Tupaki Desk   |   26 Jan 2024 11:56 AM GMT
ఫిబ్ర‌వ‌రిలో ద‌ళ‌ప‌తి విజ‌య్ రాజ‌కీయ పార్టీ లాంచ్?
X

సినీ నటుడు, ద‌ళ‌పతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించడంపై సామాన్య ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అత‌డు గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటున్నాడు. విజయ్ తన సినీ కెరీర్‌కు విరామం ఇచ్చి రాజ‌కీయాల్లోకి వెళుతున్నాడ‌నే వార్తలు ముఖ్యాంశాలుగా మారాయి. ఇప్పటి వరకు కేవలం సమావేశాలు, చర్చలు మాత్రమే జరగ్గా, ఎట్టకేలకు దళపతి విజయ్ పార్టీకి సంబంధించిన విషయాలు మెటీరియలైజ్ అయ్యేలా కనిపిస్తోంది.

వచ్చే నెలలోపు విజయ్ తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడని క‌థ‌నాలొస్తున్నాయి. ఈరోజు జరిగిన సమావేశంలో విజయ్‌ని పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీలో ఇతర కీలక పదవులు కూడా భర్తీ అయ్యాయి. పార్టీ పేరు ఖరారు కాగానే ఎన్నికల సంఘంలో నమోదు ప్రక్రియ ముగియనుంది.

విజయ్ రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో పుకార్లు ఇప్ప‌టికే చాలా హల్చల్ చేసాయి. కానీ ఇప్ప‌టికి అధికారికం కానున్నాయి. తమిళ చిత్ర పరిశ్రమలో నటీనటులు రాజకీయ నాయకులుగా మారారు

ద‌ళ‌పతి విజయ్ తమిళనాడు నుండి రాజకీయ ప్రపంచంలోకి ప్రవేశిస్తున్న మొదటి నటుడు కాదు.. క‌చ్చితంగా చివరి నటుడు కూడా కాదు. ఎంజీఆర్ - జ‌య‌ల‌లిత‌-క‌రుణానిధి స‌హా గతంలో చాలా మంది సినీప్ర‌ముఖులు త‌మిళ‌నాడును ఏలారు. భారతదేశంలో ముఖ్యమంత్రి అయిన మొదటి సినీ నటుడు ఎంజీ రామచంద్రన్. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన జయలలిత .. డిఎండికెలో విజయవంతమైన కెప్టెన్ విజయకాంత్ రాజ‌కీయాల్లో సుదీర్ఘ కాలం కొన‌సాగారు.

అయితే ఇటీవ‌ల కొంద‌రు రాజ‌కీయాల్ని ప్ర‌య‌త్నించి మిడిల్ డ్రాప్ అయ్యారు. తమిళనాడు రాజకీయ వాతావరణంలో ముద్ర వేయడానికి రజనీకాంత్ చేసిన ప్రయత్నం ప్రణాళిక ప్రకారం జరగలేదు. అనారోగ్యం స‌హా అనేక కార‌ణాల‌తో ర‌జ‌నీ తన పార్టీని రద్దు చేశాడు. రజనీకాంత్ సమకాలీనుడైన కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో తన మొదటి ప్రయత్నంలో అదే ప‌రిస్థితిని ఎదుర్కొన్నాడు. అయితే ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ద‌ళ‌పతి విజయ్ తనదైన ముద్ర వేయగలడా అనే ప్రశ్న అలానే మిగిలి ఉంది. కొన్నిలికి కాల‌మే స‌మాధానం చెబుతుంది.

దళపతి విజయ్ సినీకెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభుతో తన తదుపరి చిత్రం GOAT షూటింగ్‌లో ఉన్నాడు. ఇది విజ‌య్ కెరీర్ 68వ వెంచర్. అతను తన రాజకీయ ఆశయాల సాధ‌న కోసం దృష్టి పెట్టడానికి త‌దుప‌రి విరామం తీసుకుంటాడు.