Begin typing your search above and press return to search.

'దంగల్‌' స్టార్‌ మృతి

బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు సౌత్‌ సినీ ప్రేక్షకులను మెప్పించిన సూపర్ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్ మూవీ 'దంగల్‌'.

By:  Tupaki Desk   |   17 Feb 2024 9:49 AM GMT
దంగల్‌ స్టార్‌ మృతి
X

బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు సౌత్‌ సినీ ప్రేక్షకులను మెప్పించిన సూపర్ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్ మూవీ 'దంగల్‌'. ఇండియాతో పాటు చైనాలో కూడా దంగల్ భారీ విజయాన్ని సొంతం చేసుకుని రికార్డ్‌ స్థాయి వసూళ్లను నమోదు చేసుకున్న విషయం తెల్సిందే.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమాగా ఇప్పటికి కూడా దంగల్ రికార్డ్‌ ఉంది. అలాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరు దక్కింది. ఆ సినిమాలో అమీర్ ఖాన్ రెండో కూతురు బబితా ఫోగట్‌ గా నటించిన సుహానీ భట్నాగర్ కి మంచి గుర్తింపు వచ్చింది.

బాల నటిగా దంగల్ లో నటించిన సుహానీ భట్నాగర్‌ ఈ మధ్య కాలంలో నటిగా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఆమె తుది శ్వాస విడిచారు. బాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సుహానీ తన 19వ ఏట మృతి చెందారు.

బబిత పాత్రలో నటించి మెప్పించిన సుహానీకి ఇటీవల ఒక యాక్సిడెంట్‌ లో కాలు విరిగింది. ఆ చికిత్స కోసం ఆమె తీసుకున్న మెడిసిన్‌ వికటించడంతో మృతి చెందినట్లుగా బాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు సుహానీ మృతికి గల కారణాలపై అధికారికంగా క్లారిటీ రాలేదు.

సుహానీ మృతిపై బాలీవుడ్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దంగల్ టీం మొత్తం ఆమె మృతి పట్ల షాక్ కి గురి అయ్యారు.