'దంగల్' సీక్వెల్...చరిత్ర తిరగరాసే సమయమిది!
దేశ వ్యాప్తంగా జరుగుతోన్న చర్చ ఇది. ఇక నిష్క్రమణ తర్వాత వినేష్ ఫోగట్ చేసిన వ్యాఖ్యలతో ప్రతీ భారతీయుడు హృదయం మరింత బరువెక్కింది.
By: Tupaki Desk | 8 Aug 2024 12:53 PM GMTరెజ్లర్ వినేష్ ఫోగట్ ని ఫైనల్ లో? చూసేందుకు దేశం సిద్ధమవుతున్న వేళ ఆమె నిష్క్రమణ ఒక్కసారిగా కోట్లాది మంది భారతీయుల హృదయాల్ని, ఆశల్నిచిదిమేసింది. భారతదేశ చరిత్రలోనే కాదు..ఒలింపిక్స్ చరిత్రలోనే మునుపెన్నడు చోటుచేసుకుని అరుదైన ఘటన చోటు చేసుకోవడంతో? వినేష్ తుది పోరు నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. వినేష్ బరువు ఆమె వెయిట్ కేటగిరీ కంటే కొంచెం ఎక్కువగా ఉందని అనర్హత వేటు పడింది.
ఈ వార్త భారతీయులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పతకం తెస్తుందన్న ఫోగట్ నిష్క్రమణ ఏంటి? అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతోన్న చర్చ ఇది. ఇక నిష్క్రమణ తర్వాత వినేష్ ఫోగట్ చేసిన వ్యాఖ్యలతో ప్రతీ భారతీయుడు హృదయం మరింత బరువెక్కింది. కంట కన్నీళ్లు కారాయి. నిష్క్రమణ అనంతరం వినేస్ రిటైర్మెంట్ ప్రకటిండచంపై నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి అన్న వాదనలు తెరపైకి వచ్చాయి.
అయితే ఆమె నిష్క్రమణ వెనుక రాజకీయం సైతం జరిగిందనే ప్రచారం నెట్టింట జరుగుతోంది. సోషల్ మీడియాలో ఆమెకి మద్దతుగా దేశం మొత్తం నిలిచింది. ఆమె ప్రతభను ప్రశంశిస్తూ ఎన్నో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడీ ఆసక్తికర కథనాలే దంగల్ సీక్వెల్ దారి తీస్తాయా? అన్న సందేహాలు బాలీవుడ్ లొ మొదలయ్యాయి. భారత మాజీ రెజ్లర్ గీతా సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా నితీష్ తివారీ తెరకెక్కించిన 'దంగల్' ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.
తండ్రి ఆశయల్ని పిల్లల ద్వారా మహావీర్ సింగ్ ఫోగట్ ఎలా సాధించారు? అన్న వాస్తవ సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఇందులో మహావీర్ సింగ్ పాత్రలో అమీర్ ఖాన్ , గీతా సింగ్ పాత్రలో ఫాతిమా షనా షేక్ నటించారు. ఇద్దరు సినిమాని రెండు భుజాలపై నడిపించిన తీరు బాక్సాఫీస్ రికార్డులనే తారు మారు చేసింది.
ఏకంగా 2000 కోట్ల వసూళ్లతో ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర రాసింది. ఇప్పటికీ ఆ రికార్డు పదిలంగానే ఉంది. మళ్లీ ఆ ఛాన్స్ వినేష్ ఫోగట్ బయోపిక్ కి కనిపిస్తుంది. నితీష్ తివారీ-అమీర్ ఖాన్ సంకల్పిస్తే? అది సాధ్యమే.