Begin typing your search above and press return to search.

కుటుబంలో క‌ష్టాల‌తో డేనియ‌ల్ వివాహానికి దూరంగా!

త‌మిళ న‌టుడు డేనియ‌ల్ బాలాజీ వివాహంపై ఇప్పుడు నెట్టింట ఆస‌క్తిక‌ర చర్చ సాగుతుంది.

By:  Tupaki Desk   |   30 March 2024 10:02 AM GMT
కుటుబంలో క‌ష్టాల‌తో డేనియ‌ల్ వివాహానికి దూరంగా!
X

త‌మిళ న‌టుడు డేనియ‌ల్ బాలాజీ వివాహంపై ఇప్పుడు నెట్టింట ఆస‌క్తిక‌ర చర్చ సాగుతుంది. ఆయ‌న పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్న దానిపై స‌రైన క్లారిటీ లేదు. అయితే ఆయ‌న గ‌త ఇంట‌ర్వ్యూల్లో వివాహ జీవితానికి దూరంగా ఉన్న‌ట్లు చెప్పిన సంద‌ర్భాలున్నాయి. ఆయ‌న పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కొన్ని కార‌ణాలున్న‌ట్లు తెలుస్తోంది. డేనియ‌ల్ కుటుంబం పెద్ద‌దే. ఐదుగురు సోద‌రుల‌తో పాటు..ఐదుగురు సోద‌రీమ‌ణులు కూడా ఉన్నారు.

మొత్తంగా బాలాజీ త‌ల్లిదండ్రుల‌కు ప‌ద‌కొండు మంది సంతానం. వాళ్లంతా పెళ్లి చేసుకుని స్థిర‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. కానీ డేనియ‌ల్ బాలాజీ మాత్రం వివాహానికి దూరంగా ఉన్నాడు. త‌న 25వ ఏట త‌ల్లికి పెళ్లి చేసుకోన‌ని చెప్పాడుట‌. కుటుంబంలో పెళ్లిళ్లు అయ్యాక గొడ‌వ‌లు చోటు చేసుకోవ‌డం...క‌ష్టాలు చూసి వివాహం వ‌ద్దు అని అప్పుడే నిర్ణ‌యించుకున్నాడుట‌. పెళ్లి త‌ర్వాత భార్య‌..పిల్ల‌లు ...వాళ్ల కోసం సంపాద‌న‌..అప్పులు... ఆజీవితం కోసం త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో మోసాలు చేయ‌డం.

ఇవ‌న్నీ జీవితంలో భాగ‌మ‌వుతాయని త‌ల్లికి అర్ద‌మయ్యేలా చెప్పి ఒప్పించాడుట‌. అందుకే పెళ్లి చేసుకోలేద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు. తాను సంపాదించిన డ‌బ్బు అంతా ఓ గుడి కోసం ఖ‌ర్చు చేసారుట‌. ఆ గుడి కి వ‌చ్చే భ‌క్తులతో పాటు...త‌న త‌ల్లి కూడా త‌రుచూ అదే గుడికి వెళ్ల‌డంతో పాడు బ‌డిన ఆ గుడి నిర్మాణం కోసం త‌న సంపాద‌న‌లో చాలా వ‌ర‌కూ అక్క‌డే ఖ‌ర్చు చేసారుట‌. ఆ గుడి ప‌నుల్లో ఉండే `కేజీఎఫ్` సినిమాలో ఛాన్స్ కూడా వ‌దులుకున్న‌ట్లు గ‌తంలో తెలిపాడు.

ఈ విష‌యం య‌శ్ కి తెలిసి తానే స్వయంగా గుడి పూర్త‌యిన త‌ర్వాత వెళ్లి వ‌చ్చాడుట‌. ఆ న‌టులు ఇద్దరి మ‌ధ్య మంచి స్నేహ కూడా ఉందిట‌. కేజీఎఫ్ లో న‌టించ‌మ‌ని య‌శ్ స్వ‌యంగా ఫోన్ చేసి అడిగాడుట‌. కానీ త‌న ప‌రిస్థితి చెప్పి ఒప్పించిన‌ట్లు తెలుస్తోంది. ఆ కార‌ణంగానే గుడి ప‌నులు పూర్త‌యిన త‌ర్వాత య‌శ్ వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.