Begin typing your search above and press return to search.

డార్లింగ్ మూవీ బిజినెస్ ఎంతంటే?

ప్రియదర్శి, నభా నటేష్ జోడీగా తెరకెక్కిన డార్లింగ్ మూవీ జులై 19న థియేటర్స్ లోకి అడుగుపెడుతోంది

By:  Tupaki Desk   |   14 July 2024 9:11 AM GMT
డార్లింగ్ మూవీ బిజినెస్ ఎంతంటే?
X

ప్రియదర్శి, నభా నటేష్ జోడీగా తెరకెక్కిన డార్లింగ్ మూవీ జులై 19న థియేటర్స్ లోకి అడుగుపెడుతోంది. అశ్విన్ రామ్ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అతనికిది మూడో సినిమా కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ లో ప్రియదర్శి అండ్ టీమ్ ఉన్నారు. హీరోగా అతనిది మూడో సినిమా. మల్లేశం, బలగం తర్వాత ప్రియదర్శి ఈ సినిమాతో హీరోగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.

గత ఏడాది బలగం సినిమాతో ప్రియదర్శి హీరోగా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సారి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రియదర్శి సిద్ధం అయ్యాడు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. నభా నటేష్ ఈ సినిమాలో స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న అమ్మాయిగా కనిపిస్తోంది. రెండు రకాల వ్యక్తిత్వాలు ఉన్న హీరోయిన్ ని పెళ్లి చేసుకొని ప్రియదర్శి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది ఈ కథలో కామిక్ గా చూపించబోతున్నారు.

హనుమాన్ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ డార్లింగ్ చిత్రాన్ని నిర్మించింది. నిర్మాత కూడా మూవీని గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ప్రియదర్శి తన సర్కిల్ ఉపయోగించుకొని సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన బిజినెస్ మొత్తం కంప్లీట్ అయ్యిందంట. నైజాం రైట్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకున్నారు. హనుమాన్ సినిమా రైట్స్ ని కూడా మైత్రీ వారే సొంతం చేసుకొని భారీ లాభాలు సొంతం చేసుకున్నారు.

ఇప్పుడు డార్లింగ్ మూవీ నైజాం రైట్స్ ని కూడా 3 కోట్లకి మైత్రీ డిస్టిబ్యూటర్స్ దక్కించుకోవడం విశేషం. అలాగే ఆంధ్రా హక్కులని ఏషియన్ సురేష్ 2.50 కోట్లకి సొంతం చేసుకొని రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా మంచి ధరకి రైట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా 5.50-6 కోట్ల మధ్యలో ఈ సినిమా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. జులై 19న ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. సినిమా మీద పాజిటివ్ వైబ్ ఉండటంతో యూత్ చూడటానికి ఇంటరెస్ట్ చూపించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

నభా నటేష్ కి ఈ సినిమాతో కచ్చితంగా హిట్ రావాల్సి ఉంటుంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె డార్లింగ్ సినిమాతో మరల ప్రేక్షకుల ముందుకి వస్తోంది. అలాగే బలగం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రియదర్శి డార్లింగ్ సినిమాతో మరో సక్సెస్ అందుకొని హీరోగా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోవాలని అనుకుంటున్నారు.