Begin typing your search above and press return to search.

ట్రైలర్: ప్రియదర్శికి చుక్కలు చూపించే డార్లింగ్

అయితే ప్రియదర్శి.. ఎప్పటి లాగానే యాక్టింగ్ తో అదరగొట్టేశారు. డైలాగ్ డెలివరీ బాగుంది. కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తోంది. నభా నటేష్ కూడా బాగా నటించినట్లు కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   7 July 2024 6:59 AM GMT
ట్రైలర్: ప్రియదర్శికి చుక్కలు చూపించే డార్లింగ్
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు, కమెడియన్ ప్రియదర్శి ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి.. మల్లేశం మూవీతో హీరోగా మారారు. బలగం సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలోనే డార్లింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది!

అయితే సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే సినీ ప్రియుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు సహా ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మూవీపై పాజిటివ్ బజ్ కూడా క్రియేట్ అయింది. అదే జోష్ తో డార్లింగ్ మూవీ మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు.

సరికొత్త పోస్టర్ తో ఆదివారం ఉదయం ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. చెప్పినట్లు నేడు విడుదల చేశారు. చిన్నప్పటి నుంచి పారిస్ వెళ్లాలని.. అది కూడా పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్లాలని ఫిక్స్ అయిపోతాడు హీరో. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడు. తీరా తన భార్యకు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది. దీంతో హీరోకు చుక్కలే. క్షణక్షణానికి అపరిచితురాలి పెళ్లాం మూడ్ మారిపోతుంటుంది. మరి చివరికి ఏం జరిగిందనేది సినిమా!

అయితే ప్రియదర్శి.. ఎప్పటి లాగానే యాక్టింగ్ తో అదరగొట్టేశారు. డైలాగ్ డెలివరీ బాగుంది. కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తోంది. నభా నటేష్ కూడా బాగా నటించినట్లు కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఓవరాల్ గా ట్రైలర్ ను అద్భుతంగా కట్ చేశారు మేకర్స్. ఫన్ రైడ్ గా ఉన్న ఈ ట్రైలర్ తో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచేశారు. ట్రైలర్ అదిరిపోయిందని, మూవీ కడుపుబ్బా నవ్వించడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు.

పాన్ ఇండియా లెవెల్ లో హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిరంజన్ రెడ్డి.. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. హేమంత్ డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటిస్తున్నారు. మురళీధర్ గౌడ్, శివ రెడ్డి, కృష్ణ తేజ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. మరి జులై 17వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.