డార్లింగ్ తో పెద్ద ప్రమాదమే పొంచి ఉందండోయ్!
అయితే ఇప్పుడా డార్లింగ్ పదంతో పెద్ద ప్రమాదమే పొంచి ఉందన్న సంగతి గుర్తించాలి సుమీ. డార్లింగ్ అనే పదం లైంగిక వేధింపు కిందకు వస్తుందని తాజాగా కోల్ కత్తా హైకోర్టు ఓ కేసులో తీర్పునిచ్చింది.
By: Tupaki Desk | 8 March 2024 12:30 AM GMTడార్లింగ్ అంటే అందరికీ గుర్తొచ్చే స్టార్ ప్రభాస్. ఇండస్ట్రీలో డార్లింగ్ అనే పదంతో అభిమానంగా అందర్నీ పిలుచుకోవడం ఆయనకు ఓ అలవాటు. ఎదుట వారిపై తన అభిమానాన్ని..ప్రేమని అంతా డార్లింగ్ గా పిలచుకుని చూపిస్తుంటాడు.ఆన్ సెట్స్ అయినా..ఆఫ్ ది సెట్ అయినా ప్రభాస్ నోట ఎప్పుడూ వినిపించే పదం డార్లింగ్...డార్లింగ్. అదే అలవాటు ప్రభాస్ అభిమానులకు వచ్చేసింది. అభిమానులు సైతం జోవియల్ గా డార్లింగ్.. డార్లింగ్ అని పిలుచుకుంటారు.
అయితే ఇప్పుడా డార్లింగ్ పదంతో పెద్ద ప్రమాదమే పొంచి ఉందన్న సంగతి గుర్తించాలి సుమీ. డార్లింగ్ అనే పదం లైంగిక వేధింపు కిందకు వస్తుందని తాజాగా కోల్ కత్తా హైకోర్టు ఓ కేసులో తీర్పునిచ్చింది. 354 ఏ..509 సెక్షన్ల కింద కేసులు నమోదవుతాయని స్పష్టం చేసింది. మద్యం మత్తులో ఉన్న ఓవ్యక్తి మహిళా కానిస్టేబుల్ ను డార్లింగ్ అని పిలవడంపై ఓ కేసు నమోదైంది. హైకోర్టు విచారణలో భాగంగా పరాయి స్త్రీలను ఇష్టం వచ్చినట్లు పిలిచే స్థాయికి భారత్ దిగజారలేదని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ప్రభాస్ కూడా డార్లింగ్ అని పిలుస్తాడు? కదా అన్న సందేహం ఈ కొత్త జడ్జిమెంట్ వచ్చిన దగ్గర నుంచి నెట్టింట చర్చకు వస్తోంది. అయితే ప్రభాస్ డార్లింగ్ అని పిలిచేది కేవలం తనకు బాగా సన్ని హితంగా ఉండే పురుషుల్ని మాత్రమే. తరుచూ తన చుట్టూ ఉండే స్నేహితుల్ని..సన్నిహితుల్ని మాత్రమే పిలుస్తారు. వారు కూడా ప్రభాస్ ని అదే పదంతో పిలుస్తుంటారు. కాబట్టి అక్కడ కోర్టు జడ్జిమెంట్కి.. ప్రభాస్ డార్లింగ్ పిలుపుకి ఎలాంటి సంబంధం లేదు.
కానీ కొత్త జడ్జిమెంట్ తో నెట్టింట మాత్రం డార్లింగ్ పదం తీవ్ర చర్చకు దారి తీస్తుంది. సెలబ్రిటీల్లో డార్లింగ్ అని పిలిచే వారెవరు? అంటూ అభిమానులు చర్చకు తెర తీయడంతోనే ప్రభాస్ పేరు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 'కల్కి 2898' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న సినిమా షూటింగ్ క్లైమక్స్ కి చేరుకుంది. అన్ని పనులు పూర్తి చేసి మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ తర్వాత ప్రభాస్ రాజాసాబ్ షూట్ లో పాల్గొంటాడు.