Begin typing your search above and press return to search.

అభిమాని హ‌త్య కేసు: ద‌ర్శ‌న్‌కి బెయిల్ వ‌స్తుందా రాదా?

రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్ ఎట్టకేలకు తన బెయిల్ పిటిషన్‌పై తాజా విచారణలో మ‌రోసారి వాయిదా ప‌డింది.

By:  Tupaki Desk   |   6 Oct 2024 6:45 AM GMT
అభిమాని హ‌త్య కేసు: ద‌ర్శ‌న్‌కి బెయిల్ వ‌స్తుందా రాదా?
X

రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్ ఎట్టకేలకు తన బెయిల్ పిటిషన్‌పై తాజా విచారణలో మ‌రోసారి వాయిదా ప‌డింది. ఇప్ప‌టికే బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మూడుసార్లు వాయిదా పడింది. ఈనెల 8న మ‌రోసారి కోర్టు విచార‌ణ జ‌ర‌గ‌నుంది. సీనియర్ న్యాయవాది సి.వి. న‌గేష్ ఏ2 నిందితుడైన‌ దర్శన్ త‌ర‌పున‌ కోర్టులో వాదించారు. రేణుకాస్వామి హత్య కేసును పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు చేయలేదని వాదించారు. ఈ కేసులో దర్యాప్తును విమర్శిస్తూ సాక్షులను పోలీసులు సృష్టించారని న్యాయ‌వాది న‌గేష్‌ వాదించారు. ఛార్జిషీటులో నమోదైన సమాచారానికి, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలకు పూర్తి వ్యత్యాసం ఉందని వాద‌న‌లు వినిపించారు.

దర్శన్ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న బట్టలు, బూట్ల గురించి సీవీ నగేష్ ప్రస్తావించగా, దర్శన్ చెప్పులు వేసుకున్నాడని పంచనామాలో పేర్కొన్నారని, అయితే స్వాధీనం చేసుకున్న బూట్లపై రక్తపు మరకలు ఉన్నాయని పేర్కొన్న‌ట్టు భిన్న‌వాద‌న తెర‌పైకి తెచ్చారు. దర్శన్ తాను వేసుకున్న బట్టలు ఉతికి ఆరబెట్టాడని చెప్పడంతో బట్టలు రికవరీ అయ్యాయని, ఉతికిన బట్టలపై రక్తపు మరకలు ఉండడం సాధ్యమేనా? అని న్యాయ‌వాది ప్రశ్నించారు.

సాక్షిని నాశనం చేసేందుకు దర్శన్ 37 లక్షలు ఇచ్చాడని చార్జ్ షీట్ లో ప్రస్తావన ఉంది. ఈ డబ్బును మే 2న దర్శన్‌కి ఇచ్చారు. మే 2వ తేదీన సాక్షులకు ఇవ్వడానికి డబ్బులు ఉంచారని ద‌ర్యాప్తులో చెప్పారు.. అంటే హత్య కేసును కప్పిపుచ్చేందుకు మే 2వ తేదీన వచ్చిన డబ్బును ఉంచడం సాధ్యమేనా? అని సి.వి. న‌గేష్ లా పాయింట్ ప్రశ్నించారు.

అయితే తాజా విచార‌ణ‌లో కోర్టులో తీర్పు వేరుగా ఉంది. దర్శన్ బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చేస్తార‌ని భావించిన అభిమానులు జైలు వెలుప‌ల బాణ‌సంచాతో సిద్ధ‌మ‌య్యారు. కానీ కోర్టు ఈ విచారణను 8వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం బళ్లారి జైలులో దర్శన్ ఉన్నాడు. గ‌తంలో ఉంచిన‌ జైల్లో అతనికి రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత జైలును మార్చార‌ని ప్ర‌చార‌మైంది. ఈ హత్య కేసులో మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. అందులో ఏ-15, ఏ-16, ఏ-17కు ఇప్పటికే బెయిల్ వ‌చ్చింది. దర్శన్ ఏ-2గా ఉన్నాడు కాబట్టి బెయిల్ వస్తోందా ? రాదా ? వేచి చూడాలి.