Begin typing your search above and press return to search.

జైలు నుంచి రాగానే ప‌విత్ర‌ చేసిన ప‌నేంటో తెలుసా?

త‌న అభిమాని రేణుకాస్వామి హ‌త్య కేసులో క‌న్న‌డ హీరో ద‌ర్శ‌న్, అత‌డి ప్రియురాలు ప‌విత్ర గౌడ‌ అరెస్ట‌యిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Dec 2024 7:30 PM GMT
జైలు నుంచి రాగానే ప‌విత్ర‌ చేసిన ప‌నేంటో తెలుసా?
X

త‌న అభిమాని రేణుకాస్వామి హ‌త్య కేసులో క‌న్న‌డ హీరో ద‌ర్శ‌న్, అత‌డి ప్రియురాలు ప‌విత్ర గౌడ‌ అరెస్ట‌యిన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌న్ ఇప్ప‌టికే బెయిల్ పై జైలు బ‌య‌ట‌కు రాగా, ఇప్పుడు ఈ కేసులో ఏ1 గా ఉన్న‌ ప‌విత్ర గౌడ బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ప‌విత్ర బ‌య‌ట‌కు రాగానే, ఇదిగో ఇలా నేరుగా దైవ‌ద‌ర్శ‌నానికి వెళ్ల‌డ‌మే గాక‌, ద‌ర్శ‌న్ కోసం పూజ‌లు చేసార‌ని క‌న్న‌డ టీవీ చానెల్ న్యూస్ 1 వైర‌ల్ చేసిన ఒక వీడియో చ‌ర్చ‌గా మారింది. ఇది వీక్షించిన అభిమానులు ద‌ర్శ‌న్ పై ఎంత ప్రేమ‌? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

రేణుకాస్వామి హ‌త్య కేసులో దర్శ‌న్ ని ప్రేరేపించిన ప్ర‌ధాన నిందితురాలు ప‌విత్ర గౌడ‌కు ప‌లుమార్లు కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. ఆగ‌స్టు చివ‌రిలోను బెయిల్ పిటిష‌న్ విచారించిన కోర్టు నిరాక‌రించ‌డం నిరాశ‌ప‌రిచింది. కానీ ఇప్పుడు ప‌విత్ర బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. రేణుకా హ‌త్య కేసులో ఏ1 గా ఉన్న ప‌విత్ర‌కు, ఆమె టీనేజ్ కూతురుకు సోషల్ మీడియాల్లో ద‌ర్శ‌న్ అభిమానుల నుంచి చాలా ఆగ్ర‌హం ఎదురైంది. వారిపై ఇన్‌స్టా ఖాతా ద్వేషపూరిత వ్యాఖ్యలతో నిండిపోయింది.

నిందితుల‌కు కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ ఎస్ విశ్వజిత్ శెట్టి బెయిల్ పిటిషన్లను విచారించారు. ఈ కేసులో మరో ఐదుగురు నిందితులు నాగరాజు, అను కుమార్, లక్ష్మణ్, జగదీష్ అలియాస్ జగ్గా , ఆర్ ప్రదూష్ రావులకు బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ షరతుల ప్రకారం, నిందితులు కోర్టు అధికార పరిధిని విడిచిపెట్టి వెళ్ల‌కూడ‌దు. వారు సాక్షులను సంప్రదించకూడ‌దు.. అలాగే భయపెట్టకూడ‌దు!.