ఆలయాల బాట పట్టిన హీరో..కారణం అదేనా?
అయితే దర్శన్ ఒక్కసారిగా ఇలా వరుసగా ఆలయాల బాట పట్టడంతో అంతా షాక్ అవుతున్నారు. ఆయన లో ఒక్కసారిగా వచ్చిన భక్తి భావంతో ఖంగుతింటున్నారు.
By: Tupaki Desk | 17 Jan 2025 6:29 AM GMTకన్నడ నటుడు దర్శన్ ఆలయాల బాట పట్టాడు. శ్రీరంగ పట్టణం తాలుకా ఆరతి ఉక్కడలో వెలిసిన శ్రీ అహల్య దేవి మారెమ్మ దేవస్థానాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యక పూజలు నిర్వహించారు. భార్య విజయలక్ష్మి, కుమారుడితో కలిసి దర్శన్ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మేలు కోటె ఎమ్మెల్యే దర్శన్ పుట్టణ్ణయ్యతో తో పాటు భారీ ఎత్తున అభిమానులు కూడా పాల్గొన్నారు.
దర్శన్ అంతకు ముందు బళ్లారి జిల్లా కురుగోడు లోని బసవేశ్వర ఆలయంలో కూడా పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే దర్శన్ ఒక్కసారిగా ఇలా వరుసగా ఆలయాల బాట పట్టడంతో అంతా షాక్ అవుతున్నారు. ఆయన లో ఒక్కసారిగా వచ్చిన భక్తి భావంతో ఖంగుతింటున్నారు. నిత్యం ఏదో దేవాలయంలో పూజలు చేస్తూ భక్తి చింతన పొందుతున్నాడు. దర్శన్ మర్డర్ కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత జరుగుతోన్న పరిణామా లివన్నీ. దీంతో నెటిజనులు దర్శన్ లో గొప్ప పరివర్తన కలిగిందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
అభిమాని రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్ కొన్నినెలలు పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మానసికంగా ఎంతో కృంగిపోయాడు. బెయిల్ దొరకడానికి నెలలు సమయం పట్టింది. భర్తను ఎలాగైనా బెయిల్ పై బయటకు తీసుకురావాలని భార్య విజయలక్ష్మి చేయని ప్రయత్నం లేదు. దర్శన్ అరెస్ట్ అయిన డే వన్ నుంచి బెయిల్ ప్రతయ్నాలు మొదలు పెట్టింది. కానీ సాక్ష్యాలన్నీ దర్శన్ కి వ్యతిరకంగా ఉండటంతో బెయిల్ కష్టమైంది.
చివరికి అనారోగ్యానికి గురికావడంతో కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అటుపై సుప్రీంకోర్టుకు వెళ్లి వాదనలు వాదనలు వినిపించడంతో రెగ్యులర్ బెయిల్ మంజూర్ అయింది. దీంతో కొన్ని రోజుల పాటు ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. అటుపై ఇలా ఆలయాల బాట పట్టారు. ఈ కేసులో దర్శన్ ఏ 2 గా ఉండగా, అతడి ప్రియురాలు పవిత్రాగౌడ్ ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే. ఇంకా మరో 15 మంది కూడా నిందులుగా ఉన్నారు. అందరికీ కోర్టు నుంచి బెయిల్ మంజూరైంది.