రిమాండ్ ఖైదీలకు జైలు జీవితం తప్పేలా లేదు!
రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ ఏ-2గా, అతడి ప్రియురాలు పవిత్రా గౌడ్ ఏ-1 ముద్దాయి లుగా ఆరోపణలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 July 2024 7:46 AM GMTరేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ ఏ-2గా, అతడి ప్రియురాలు పవిత్రా గౌడ్ ఏ-1 ముద్దాయి లుగా ఆరోపణలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు జ్యూడీషల్ రిమాండ్ లో ఉన్నారు. దీనిలో భాగంగా పరప్పన్ అగ్రహారం జైలులో ఉన్నారు. కోర్టులో నేరం రుజువైతే శిక్ష తప్పదన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అయితే అందుకు అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రాధమిక దర్యాప్తులో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అటుపై లోతైన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు ఎన్నో బయట పడుతున్నాయి. అత్యంత కిరాతకంగా రేణుకాస్వామిని కొట్టి చంపినట్లు ఆధారాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెవి, దవడ , మర్మాంగం లాంటివి కోసేసి కర్కశంగా వ్యవరించినట్లు దర్యాప్తు రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తాజాగా మరిన్ని ఆధారాలు పోలీసులు సేకరించారు. వీటిని బట్టి ఇద్దరి చుట్టూ జైలు ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది.
దర్శన్, పవిత్ర వేలి ముద్రలు హత్యజరిగిన ప్రాంతంలో లభ్యమయ్యాయి. అటుపై మృతదేహన్ని తరలించిన వాహనంలో ఉన్న వేలి ముద్రలతోనూ సరిపోలాయి. అలాగే బెంగుళూరు, హైదరాబాద్ ఫోరెన్సిర్ రిపోర్ట్ కూడా ఒకేలా ఉంది. ఇక డిఎన్ ఏ రిపోర్ట్ రావాలి. ఇవన్నీ కూడా దర్శన్, పవిత్రలకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఈ ఆధారాల్ని బట్టే కోర్టు తీర్పు ఉంటుంది. దీంతో నెట్టింట నెటి జనులు అగ్రహంతో ఊగిపోతున్నారు.
ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు కన్నడ పరిశ్రమ నుంచి దర్శన్ కి కొంతమంది పెద్ద వాళ్లు అంతా మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవలే సుమలత కూడా దర్శన్ అలాంటి వాడు కాదని, నిర్దోషిగా బయటకు వస్తాడని ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బెయిల్ కోసం దర్శన్ భార్య విజయలక్ష్మి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.