రాజకీయ నాయకులు సాయం కోరిన దర్శన్!
రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 Aug 2024 12:03 PM GMTరేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు కోర్టు ముందు హాజరు పరచడం రిమాండ్ పొడిగించడం జరిగింది. తాజాగా కేసులో భాగమైన 17 మందిపై చార్జ్ షీట్ కూడా దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ప్రాధమిక విచారణ, పోలీసులు సేకరించిన సాక్షాలు, ఇతర ఆధారాలు, రిపోర్టులు అన్నీ దర్శన్ కి వ్యతిరేకంగా ఉండటంతో కేసు నుంచి తప్పించుకోవడానికి ఏమాత్రం ఛాన్స్ కనిపించలేదు.
మరోవైపు దర్శన్ భార్య విజయలక్ష్మి బెయిల్ కోసం చేయాల్సిన ప్రయత్నాలన్ని చేస్తున్నా? లాభం లేకపోతుంది. దర్శన్ అరెస్ట్ అయిన నాటి నుంచి బెయిల్ కోసం నిర్విరామంగా ప్రయత్నిస్తునే ఉన్నారు. కానీ ఇంతవరకూ సాధ్యపడలేదు. తాజాగా దర్శన్ కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. రేణుకాస్వామి హత్య అనంతరం కేసు నుంచి బయటపడేయాలని దర్శన్ పలువురు రాజకీయ నాయకులను కోరినట్లు వాట్సాప్ ద్వారా బయటపడింది.
దర్శన్ ని అరెస్ట్ చేసాక అతడి మోబైల్ స్వాదీనం చేసుకుని వాట్సాప్ చాట్ ని పరిశీలించారు. ఈ క్రమంలో హత్య అనంతరం దర్శన్ ఎవరెవరితో మాట్లాడాడా? ఎవరితో చాటింగ్ చేసాడు? ఎవరికి వాట్సాప్ ద్వారా టచ్ లోకి వెళ్లాడు? వంటి డేటా అంతా తీసారు. ఇందులో కన్నడలో ప్రముఖ రాజకీయ నాయకులంతా అతడికి టచ్ లోకి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
హత్యకు సంబంధించి దర్శన్ ప్రణాళిక వేసిన తర్వాత తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఒక తప్పును కప్పి పుచ్చడానికి మరో తప్పు..ఆ తప్పు నుంచి బయట పడటానికి మరో తప్పు ఇలా? ఎన్నో తప్పులు దర్శన్ వైపు నుంచి కనిపిస్తున్నాయని పోలీసులు భావిస్తున్నారు.