వెలుగులోకి హీరో గారి నీచమైన విలన్ వేషాలు!
ఒక ఆడదాని కోసం తనను ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానించే అభిమానిని దారుణంగా హత్య చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
By: Tupaki Desk | 21 Jun 2024 12:30 PM GMTకన్నడ స్టార్ హీరో దర్శన్ మొన్నటి వరకు కోట్లాది మందికి అభిమాన నటుడు. కానీ ఇప్పుడు ఆయన పేరు వింటేనే కన్నడ సినీ ప్రేక్షకులతో పాటు అన్ని భాషల వారు కూడా చీదరించుకుంటున్నారు. ఒక ఆడదాని కోసం తనను ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానించే అభిమానిని దారుణంగా హత్య చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
భార్యకు దూరంగా ఉండి నటి పవిత్ర గౌడకు దగ్గరగా ఉంటున్న దర్శన్ తీరును స్వయంగా యాన అభిమాని అయిన రేణుకా స్వామి తప్పుబట్టడం, నటిని దుర్భాషలాడటం చేయడం జరిగింది. రేణుకా స్వామి హత్య చేసి మరీ తన కోపంను చల్లార్చుకున్న హీరో దర్శన్ ఆ తర్వాత తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు చాలా విలన్ వేశాలు వేశాడు.
ఏకంగా రూ.50 లక్షలు ఖర్చు చేసి శవమును మాయం చేయడంతో పాటు, సాక్ష్యాలు లేకుండా చేయాలని భావించాడట. పోలీసులు వెళ్లడిస్తున్న ఈ విషయాలు అతడి అభిమానులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. దర్శన్ మరీ ఇంత నీచుడా అంటూ ఇన్నాళ్లు అభిమానించిన వారు ద్వేషిస్తున్నారు.
ఈ కేసులో తన పేరు రాకుండా ఉండేందుకు, అసలు శవం లేకుండా చేసేందుకు దర్శన్ తన స్నేహితుడు అయిన మోహన్ రాజు వద్ద రూ.40 లక్షలు అప్పుగా తీసుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా విచారణ లో దర్శన్ తెలియజేశాడు అంటూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న దర్శన్ తిరిగి బయటకు రావడం అంత సులభం కాదని, హత్య కేసు లో పూర్తిగా ఇరుక్కు పోయిన దర్శన్ కు సుదీర్ఘ కాలం జైలు శిక్ష తప్పదు అంటూ న్యాయ నిపుణులు మరియు కన్నడ మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.