వైరల్ : ఓరి మీ అభిమానం తగలెయ్యా..!
తనను అమితంగా అభిమానించే రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ జైల్లో ఉన్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 2 July 2024 5:28 AM GMTతనను అమితంగా అభిమానించే రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ జైల్లో ఉన్న విషయం తెల్సిందే. అత్యంత దారుణంగా రేణుకా స్వామిని దర్శన్ చంపాడు/చంపించాడు అనే విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన కొన్ని ఫోటోలు షాకింగ్ గా ఉన్నాయి.
వెంటనే దర్శన్ ను కఠినంగా శిక్షించాలంటూ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన్ను అమితంగా అభిమానించే వారు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో దర్శన్ ను ఎంతగా ట్రోల్స్ చేస్తున్నారో అదే స్థాయిలో ఆయనకి మద్దతు ఉంది.
ఇదే సమయంలో దర్శన్‌కి జైల్లో కేటాయించిన ఖైదీ నెం.6106 సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంది. ఆ మధ్య ఇద్దరు ముగ్గురు కన్నడ నిర్మాతలు ఖైదీ నెం.6106 టైటిల్ ను రిజిస్టర్ చేయించేందుకు ప్రయత్నించారట. కానీ ప్రస్తుతం కేసు కోర్టు లో ఉన్న కారణంగా ఆ టైటిల్ ను రిజిస్ట్రర్ చేయలేమని చెప్పారట.
ఇక దర్శన్ అభిమానులు తమ ఒంటి మీద టాటూలుగా ఖైదీ నెం.6106 ను వేయించుకుంటున్నారు. కార్లు మరియు బైక్స్ పై కూడా ఖైదీ నెం.6106 ను వేయించుకోవడం ద్వారా తమ అభిమానం ను చాటుకుంటున్నారు. సోషల్ మీడియాలో టాటూలు, స్టికర్స్ వైరల్ అవుతున్నాయి.
నెట్టింట ఈ ఫోటోలు మరియు వీడియోలను చూసిన కొద్ది మంది ఓరి మీ అభిమానం తగలెయ్యా అంటూ విమర్శలు చేస్తూ ఉంటే, కొద్ది మంది భలే ఐడియా అంటూ తాము అదే పని చేస్తున్నారు. మొత్తానికి దర్శన్ కి కేటాయించిన ఖైదీ నెం.6106 బాగా ఫేమస్ అయ్యింది. కన్నడ రాష్ట్రంలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా ఉందంటూ స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.